Trending:


మెరుగైన సేవలు అందించేందుకు కృషి

ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అనసూయ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.


పాసింగ్​ అవుట్ ​పరేడ్ అదుర్స్

పాసింగ్​ అవుట్ ​పరేడ్ అదుర్స్ దుండిగల్‌‌లోని ఎయిర్ ఫోర్స్‌‌ అకాడమీలో శనివారం ఫ్లైయింగ్ కేడెట్ల పాసింగ్ అవుట్‌‌ పరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 9 మంది మహిళా కేడెట్లు సహా మొత్తం 235 ఫ్లైట్ కేడెట్లు గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. పిలాటస్ పీసీ-7,  సారంగ్‌‌ హెలికాప్టర్‌‌, సూర్యకిరణ్‌‌ ఏరోబాటిక్‌‌, సుఖోయ్ యుద్ధ విమానాల ఫ్లైయింగ్ ఆఫీసర్లు చేసిన...


Child Marriage | 72 ఏండ్ల వృద్ధుడితో 12 ఏండ్ల బాలికకు పెండ్లి.. అడ్డుకున్న పోలీసులు

పాకిస్థాన్‌లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్‌ బాలికతో పెండ్లికి (Child Marriage) సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది.


అన్నదాతల ఆందోళన

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.


దర్శన్‌ కస్టడీ పొడిగింపు

హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ పోలీస్‌ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. అతని ప్రియురాలు పవిత్రా గౌడ, మరో 11 మంది కస్టడీని కూడా న్యాయస్థానం శనివారం పొడిగించింది. వీరికి విధించిన ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ ఆదివారంతో ముగియనుండటంతో కోర్టులో హాజరుపర్చారు.


విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుంగతుర్తి/ శాలిగౌరారం(నకిరేకల్ )వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యనందిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడి...


ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులతోపాటు ఓ జవాన్‌ మృతిచెందాడు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌లో శనివారం చోటు చేసుకుంది.


విద్యార్థుల సంపూర్ణ వికాసమే లక్ష్యం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలిచేలా వారికి అవగాహన కల్పిస్తూ, సంపూర్ణ వికాసానికి తోడ్పాటునందించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని వివేకానంద విద్యాసంస్థల చైర్మన్‌ సౌగాని కొమురయ్య పేర్కొన్నారు.


అత్యవసర సేవలకు సంజీవిని అంబులెన్స్

అత్యవసర సేవలకు సంజీవిని అంబులెన్స్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట, వెలుగు : అత్యవసర సేవలకు ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సంజీవిని లాంటిదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శనివారం భద్రాచలం ఐటీడీఏ ద్వారా వినాయకపురం పీహెచ్​సీకి ప్రత్యేకంగా మంజూరైన అవ్వల్ అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...


వనపర్తి జిల్లాలో పురాతన రాతి శిల్పాలు లభ్యం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహానికి కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం కనిపిస్తున్నాయి.


సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ యూనిఫాం మొత్తం సిరిసిల్ల నుంచే...

సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ యూనిఫాం మొత్తం సిరిసిల్ల నుంచే... 65 లక్షల మీటర్ల క్లాత్‌‌‌‌‌‌‌‌కు జనవరిలో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల్లోనే 59 లక్షల మీటర్ల క్లాత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి పూర్తి క్లాత్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌ చేసిన టెస్కో ఉత్పత్తితో కార్మికులకు నాలుగు నెలల పని రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాష్ట్రంలోని ...


మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు

రాష్ట్రంలో స్వ యం సహాయక సంఘాలకు ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలను అందించనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.


నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు

నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనందా నది వద్ద ప్రమాదం      రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది వద్ద ప్రమాదం      మృతులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం సంతాపం రుద్రప్రయాగ్ :  ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఓ మినీ బస్సు అదుపు తప్పి అలకనందా నదిలోకి పడిపోవడంతో 12 మంది య...


గోవు బంధు పథకం.. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందో తెలుసా?

గోవు బంధు.. ఇప్పుడీ అంశం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎందుకంటే.. ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఇలాంటిది తెస్తామని కూడా చెప్పలేదు. కానీ.. బీజేపీ వర్గాలు దీన్ని తేవాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నాయి. తద్వారా.. తెలంగాణలో మరింతగా ఆ పార్టీ విస్తరించేందుకు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. (Image credit - shutterstock) తెలంగాణలో కొనసాగుతున్న దళిత బంధు, బీసీ బంధు, లాగానే గోవుబంధు పథాకాన్ని కూడా ప్రవేశపెట్టాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆవులను కాపాడేందుకు గోవుల కాపరులకు నెల నెలా జీతభత్యాలు ఇవ్వాలని కోరారు. తద్వారా గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. (Image credit - PTI) గోవుల శాలల మెయింటెనెన్స్ కోసం కూడా ప్రభుత్వం ప్రభుత్వం సహకరించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎలుక, పిల్లి, కుక్కలు చనిపోతే స్పందించే జంతు ప్రేమికులు, ఆవులను వధిస్తుంటే మాట్లాడకపోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని చక్కగా ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. గ్రామాలు, , వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకొని గోవు బంధు కూడా తేవాలని ఆయన కోరారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ చాలా పథకాలను అమలు చెయ్యలేదు. కనీసం గ్యారెంటీ పథకాలను కూడా అమలు చెయ్యలేక తలలు పట్టుకుంటోంది. ఖజానాలో డబ్బు లేదని లబోదిబోమంటోంది. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాని ఇంతవరకూ ప్రారంభించలేకపోయింది. మహిళలకు నెలకు రూ.2,500 ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో మరో కొత్త పథకం అంటే.. అది జరిగే పనేనా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచి.. కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చింది. చెప్పాలంటే.. బీజేపీ ఎదుగుదల, కాంగ్రెస్‌కి సమస్యే. హిందువుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ గోవు బంధు అంశం కూడా అందులో భాగమే కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఐతే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పథకం తెచ్చే ఆలోచనలో లేదని సమాచారం.


ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే

ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే మోదీకి మెజార్టీ లేదు న్యూఢిల్లీ : ఎన్​డీఏ సర్కారు పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీకి మెజార్టీ లేదని తెలిపారు. బీజేపీ పొత్తులను కాపాడుకునేందుకు పోరాడు తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ కామెంట్స్​ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏద...


రైతులకు షాక్.. పీఎం కిసాన్‌లో పేర్ల తొలగింపు.. మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 3 విడతల్లో మొత్తం రూ.6 వేలు ఇస్తోంది. ఈ మనీ లబ్దిదారులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్టుగా పడుతోంది. అందువల్ల రైతులు తమ మొబైల్‌కి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉంటే.. మనీ పడగానే, మెసేజ్ వచ్చేస్తుంది. ఈసారి 17వ విడత మనీని జూన్ 18న అకౌంట్లలో వేస్తోంది. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మందికి పైగా రైతుల అకౌంట్లలో రూ.21 కోట్లను జమ చేస్తోంది. ఎన్నికల్లో మూడోసారి గెలిచాక, ప్రధాని మోదీ.. జూన్ 18న తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్తున్నారు. ఆ రోజు అక్కడి నుంచి ఈ మనీ రిలీజ్ చేస్తారు. పీఎం కిసాన్ పథకంలో ప్రతీ నెలా కొత్తగా లబ్దిదారులు చేరుతున్నారు. అలాగే ఉన్న వారిలో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. KYC పూర్తి చెయ్యని వారు, సరైన పత్రాలు సమర్పించని వారు, చనిపోయిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు. ఐతే.. ఇలాంటి సందర్భంలో.. పొరపాటున కొందరి పేర్లు లిస్ట్ నుంచి పోతున్నాయి. అలా మీ పేరు తొలగితే, మీకు మనీ రాదు. అందువల్ల మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం మేలు. ఇలా చెక్ చేసుకోండి:పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లండి. అక్కడ కిందకు స్క్రాల్ చేసినప్పుడు ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner) అనే విభాగం కనిపిస్తుంది. ఆ విభాగంలోని Know Your Status క్లిక్ చెయ్యాలి. Know Your Status క్లిక్ చేసినప్పుడు ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్దిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత పక్కన కాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత Get OTP క్లిక్ చెయ్యాలి. వారి మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యాలి. అప్పుడు లబ్దిదారుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. కొంతమందికి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటో గుర్తు ఉండకపోవచ్చు. అలాంటి వారు.. Know Your Status క్లిక్ చెయ్యాలి. అక్కడ ఓపెన్ అయ్యే పేజీలో Know your registration no ఆప్షన్ ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. తిరిగి జాబితాలో మీరు ఉందో లేదో చూసుకోవచ్చు.


లైంగికదాడి కేసులో జీవిత ఖైదు

దళిత బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని మల్టీజోన్‌-2 ఐజీ సుధీర్‌బాబు అభినందించి సన్మానించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా డీఐజీ కార్యాలయానికి ఐజీ రాగా ఉమ్మడి జిల్లా డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో పాటు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.


ఖమ్మం కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం  కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం, వెలుగు : ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముజామ్మిల్ ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017కు బ్యాచ్ కు చెందిన ముజామ్మిల్ ఖాన్ ఇప్పటి వరకు పెద్దపల్లి కలెక్టర్ గా పని  చేశారు. ముజామ్మిల్ ఖాన్ తండ్రి ఏకే ఖాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ గా పనిచేశారు. అయితే ప్ర...


పుణె కారు కేసులో దన్వడే లీలలెన్నో!

పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో నిందిత మైనర్‌ బాలుడిని విడుదల చేయడంలో జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ (జేజేబీ) పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. ఈ మేరకు విచారణ కమిటీ సామాజిక న్యాయ శాఖకు 100 పేజీల నివేదిక సమర్పించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాలుడికి జేజేబీ నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యుడు ఎల్‌ఎన్‌ దన్వడే బెయిల్‌ మంజూరు చేశారు.


వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌ ఓఎంఆర్‌ స్కాన్డ్‌ కాపీలు

రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్‌ చేసిన, డిజిటలైజ్‌డ్‌ ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లను వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ శనివారం ప్రకటించారు.


ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు

ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు మేడ్చల్ జిల్లా శామీర్ పేట PS పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేరువేరు చోట్ల వరుసగా దొంగతనానికి పాల్పడ్డారు. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులలా పుస్తెలతాడు లాక్కొని బైక్ పై పారిపోయారు. అదే మండలం కేశవరం గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న మహిళ మ...


పీఈటీల పదోన్నతుల్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులు కొందరు పదోన్నతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పీఈటీల పదోన్నతుల జాబితాలో నకిలీ సర్టిఫికెట్ల విషయం జిల్లాలో కలకలం రేపుతున్నది.


నోటు పుస్తకాలనూ వదలని సర్కారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వార్థ రాజకీయం కోసం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలను సైతం వదలడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే సందర్శించారు.


గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించం : రంగనాథ్

గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించం : రంగనాథ్ మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో గొడవలు, దాడులకు కారణమైన ఎవరినీ ఉపేక్షించేది లేదని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇరువర్గాల ఘర్షణ, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పరిస్థితి సమీక్షించేందుకు  శనివారం రాత్రి ఆయన మెదక్ పట్టణానికి చేరుకున్నారు. టౌన్ పీఎస్​లో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్ ను...


సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా జోహన్నెస్​బర్గ్: సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా(71) రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆఫ్రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు రామఫోసాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో రామఫోసా....


మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క

మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి: మంత్రి సీతక్క     అన్ని ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తం     మహిళా సంఘాల వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్ హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు రూ. 20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు.  మహిళా శక్తి పథకం కింద ...


నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు

నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు మంచిర్యాల/నిర్మల్, వెలుగు: నిర్మల్, మంచిర్యాల​కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. నాగర్​కర్నూల్​అడిషనల్​కలెక్టర్ (లోకల్​బాడీస్)​గా పనిచేస్తున్న కుమార్​ దీపక్​ను కలెక్టర్​గా ప్రమోట్ ​చేస్తూ మంచిర్యాలకు ట్రాన్స్​ఫర్ చేశారు. ప్రస్తుత కలెక్టర్​ బదావత్ సంతోష్ ​నాగర్​కర్నూల్​కు...


బస్సులకు ఫిట్​నెస్​ లేకుంటే చర్యలు

బస్సులకు ఫిట్​నెస్​ లేకుంటే చర్యలు జ్యోతినగర్,వెలుగు: రామగుండం లో కొన్ని పాఠశాలలు, కాలేజీ  బస్సులు ఫిట్ నెస్ టెస్టుల్లో  భాగంగా   పర్మిట్ లేని రెండు స్కూల్ బస్సుల పై  శనివారం రామగుండం  మోటర్ వెహికల్​ ఇన్​స్పెక్టర్​  భీం సింగ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మోటర్ వెహికిల్ ఇన్​స్సెక్టర్​ మాట్లాడుతూ.. రామగుండం ప్రాంతంలో 66 స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ ...


ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కారు కృషి

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బాడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు

బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు రాజన్న సిరిసిల్ల, వెలుగు :  బ్లడ్ డోనేషన్ క్యాంప్  నిర్వహణలో  సిరిసిల్ల పోలీసులు పాత్ర వెలకట్టలేనిదని  ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జల్లా  వైస్ ప్రెసిడెంట్ ప్రయాకరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని    సోసైటీ ఆధ్వర్యంలో జిల్ల...


చెరువులను చెరబట్టారు!.. హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్

చెరువులను చెరబట్టారు!.. హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్ ప్రజా దర్బార్​లో కంప్లైంట్​ చేసినా చర్యలు తీసుకోని ఆఫీసర్లు     ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో లేఅవుట్లు వేసి అమ్మకాలు     పొలిటికల్ లీడర్లు, రియల్ వ్యాపారుల మిలాఖత్!     హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్ పాలమూరు చెరువులు, కుంటలను అక్రమార్కులు చెరబట్టారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్...


నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు.


జిల్లా యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం

నిజామాబాద్‌ జిల్లాజక్రాన్‌పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్‌ కార్తీక్‌నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువజన సాహిత్య పురస్కారం-2024ను ప్రకటించారు.


పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ

పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కొండా సురేఖ అటవీశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి సురేఖ     మంత్రి సీతక్కతో కలిసి పోడు సమస్యలపై రివ్యూ     కొత్తగా పోడు కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజనులకు హెచ్చరిక హైదరాబాద్, వెలుగు :  అటవీ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పోడు రైతుల హక్కులను కాపాడడానికి, అటవీ అ...


ముగిసిన జీ7 సదస్సు

ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు శనివారంతో విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిగినట్టు వివరించారు.


ప్రైవేట్‌కు దీటుగా విద్యనందించాలి

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


TTD Admissions : 10th పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. రేపే చివరితేది

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టెన్త్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. శిల్పకళలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.


వేతనాలు అందక పస్తులుంటున్నాం

వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని, అతి తక్కువ వేతనంతో ఆరుగాలం శ్రమిస్తున్నారన్నారు.


గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములు ఇవ్వం

భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే భూ సేకరణపై టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫామ్‌

అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్‌ ఉండనుంది. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్‌ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్‌ జిల్లాకు చేరుకుంది.


18న రైతులకు పీఎం కిసాన్‌ నిధులు

ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్‌ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు.


సైబర్‌ నేరగాళ్ల లింకులకు స్పందించొద్దు..

సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ యూనో అప్లికేషన్స్‌ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.


హలో సార్‌..

జలమండలిలో పునః ప్రారంభించిన ‘డయల్‌ యువర్‌ ఎండీ’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.


తమ్ముడిని హత్య చేశాడని వెంటాడి చంపారు

తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌,


‘ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా పడిపోవచ్చు’

కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం ఉందన్నారు.


Khairatabad Ganesh | ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు రేపు అంకురార్పణ

ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌ బాబు, కోశాధికారి మహేశ్‌ యాదవ్‌ వివరాలు వెల్లడించారు.


చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్

చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో గురువారం జరిగిన హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊట్కూర్ ఠాణాలో కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం వెల్లడించారు.  దాడికి పాల్పడిన మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్​ తరలించామన్నారు....


భవనం కట్టారు.. వసతులు మరిచారు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి.


బీజేపీ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.


రూ.2 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు సీజ్

రూ.2 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు సీజ్ కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ సికింద్రాబాద్, వెలుగు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను నార్త్​జోన్ టాస్క్ ఫోర్స్​పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులతో కలిసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన బజ్జూరి పూర...