AGNIPATH | అగ్నిపథ్‌పై వాగ్యుద్ధం.. చౌకబారు రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోదీ: విపక్షాలు

  • సైన్యం సూచన మేరకే పథకం తెచ్చామన్న ప్రధాని
  • పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ప్రతిపక్ష పార్టీల ధ్వజం

Agnipath | ద్రాస్‌(లడఖ్‌), జూలై 26: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా శుక్రవారం అగ్నిపథ్‌ స్కీమ్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సైన్యం సూచన మేరకే తమ ప్రభుత్వం అగ్నిపథ్‌ స్కీమ్‌ను అమలు చేసిందని, ఆర్మీ చేపట్టిన సంస్కరణకు అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ స్కీమే ఒక ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. స్కీమ్‌ను సమీక్షించాలని డిమాండ్‌ చేశాయి. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రోజున అమర జవాన్లకు నివాళులర్పించే సమయంలోనూ ప్రధాని మోదీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

ద్రాస్‌లో అమరులకు ప్రధాని నివాళులు

25వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని ప్రధాని మోదీ కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని పాక్‌ను హెచ్చరించారు.

2024-07-26T22:09:26Z dg43tfdfdgfd