Trending:


బాస్‌ల బదిలీ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తున్న ముజామ్మిల్‌ ఖాన్‌ను నియమించింది.


అబూజ్​మడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

అబూజ్​మడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి     ఒక జవాన్​ కూడా మృతి... ఇద్దరికి గాయాలు      కొనసాగుతున్న కూంబింగ్ భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​లో నారాయణ్​పూర్​ జిల్లా అబూజ్​మడ్​ అడవుల్లో శనివారం జరిగిన భారీ ఎన్​కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్​ జవాన్  ప్రాణాలు కోల్పోగా..  ఇద్దరు  జవాన్ల...


చెరువులను చెరబట్టారు!.. హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్

చెరువులను చెరబట్టారు!.. హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్ ప్రజా దర్బార్​లో కంప్లైంట్​ చేసినా చర్యలు తీసుకోని ఆఫీసర్లు     ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో లేఅవుట్లు వేసి అమ్మకాలు     పొలిటికల్ లీడర్లు, రియల్ వ్యాపారుల మిలాఖత్!     హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో భూములకు డిమాండ్ పాలమూరు చెరువులు, కుంటలను అక్రమార్కులు చెరబట్టారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్...


Khairatabad Ganesh | ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు రేపు అంకురార్పణ

ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌ బాబు, కోశాధికారి మహేశ్‌ యాదవ్‌ వివరాలు వెల్లడించారు.


బీజేపీ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.


జూలై 7 నుంచి 29 వరకు బోనాలు

జూలై 7 నుంచి 29 వరకు బోనాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తం: మంత్రి సురేఖ     అధికారులు సమన్వయంతో పనిచేయాలి: పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జులై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జులై 29న అంబారీ ఊరేగింపు ఉత్సవంతో ముగుస్...


తమ్ముడిని హత్య చేశాడని వెంటాడి చంపారు

తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌,


భవనం కట్టారు.. వసతులు మరిచారు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి.


మేం చెప్పినా కేసీఆర్ ​పట్టించుకోలే : రిటైర్డ్​ ఇంజినీర్లు

మేం చెప్పినా కేసీఆర్ ​పట్టించుకోలే : రిటైర్డ్​ ఇంజినీర్లు మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే మా రిపోర్టును పక్కనపెట్టి ఆయనకు నచ్చినట్లు చేసిండు జస్టిస్​ ఘోష్​ కమిషన్​ ముందు రిటైర్డ్​ ఇంజనీర్ల వెల్లడి     తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడ్తేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు     మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలన...


హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్

హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్ మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ వీడియో     సోషల్ మీడియాలో వైరల్ బారి(ఇటలీ) : ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిన్న సెల్ఫీ వీడియో దిగారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటలీలో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా మోదీతో మెలోనీ ఐదు సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను శనివార...


రమేశ్‌ కార్తీక్‌కు కేటీఆర్‌ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ రమేష్‌ కార్తీక్‌నాయక్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.


కొట్టి చంపారు..

కుటుంబ తగాదాలతో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత కుటుంబీకులే హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాతెల్లికి చెందిన కుర్మ దుర్గయ్య (35)కు అదే గ్రామానికి చెందిన లక్ష్మితో కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది.


నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు.


ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు

ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డయాలసిస్  సెంటర్ లో కొంత భాగం దగ్ధమైంది. పేషెంట్లు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుక...


బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ మధ్య దూరం పెరిగిందా? నిజమో కాదో తెలిసేది ఆ నిర్ణయంతోనే

బీజేపీకి ఇకపై సంఘ్ అవసరం లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా బీజేపీ పోకడలను విమర్శించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


PUBG: పబ్జీలో ఇద్దరు యువకులతో పరిచయం.. భారత్‌కు వచ్చిన అమెరికా యువతి

PUBG: దేశంలో మరో పబ్జీ పరిచయం బయటికి వచ్చింది. పబ్జీ ఆడుతూ భారత యువకులతో స్నేహం పెంచుకున్న ఓ అమెరికా యువతి.. ఏకంగా వారి కోసం భారత్ వచ్చేసింది. అయితే ఇద్దరితో స్నేహం చేసిన ఆ యువతి.. మొదట ఒక యువకుడి వద్ద ఉండి.. ఆ తర్వాత మరో యువకుడి వద్దకు వెళ్లింది. అయితే ఈ వ్యవహారం మొత్తం చివరికి పోలీసుల వద్దకు వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. ఇప్పటికే ఇలా పబ్జీ గేమ్‌లో పరిచయం కోసం పాక్ నుంచి ఓ వివాహిత వచ్చిన ఘటన దేశంలో తెగ చర్చనీయాంశం అయింది.


రాజకీయ డ్రామాలో పావుగా జస్టిస్‌ నర్సింహారెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న రాజాకీయ డ్రామాలో జస్టిస్‌ నర్సింహారెడ్డి పావుగా మారారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆరోపించారు.


Child Marriage | 72 ఏండ్ల వృద్ధుడితో 12 ఏండ్ల బాలికకు పెండ్లి.. అడ్డుకున్న పోలీసులు

పాకిస్థాన్‌లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్‌ బాలికతో పెండ్లికి (Child Marriage) సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది.


మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు

రాష్ట్రంలో స్వ యం సహాయక సంఘాలకు ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలను అందించనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.


డిజిటల్‌ ఇండియా బిల్లుకు కేంద్రం కసరత్తు

డీప్‌ ఫేక్‌ వీడియోల దుష్పరిణామాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు డిజిటల్‌ ఇండియా బిల్లు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.


ఉటాలో 97 ఏళ్ల బామ్మ హైస్కూల్ డిప్లొమా సంపాదించింది..

ఉటాలో 97 ఏళ్ల బామ్మ హైస్కూల్ డిప్లొమా సంపాదించింది.. జీవితంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేయలేకపోతే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే కొందరు తమ శక్తికి మించిన పనులను వయసు మళ్లిన తర్వాత అయినా పూర్తి చేసేందుకు సిద్ధపడతారు. ఈ బామ్మ కూడా అంతే.. సెంచరీ కొట్టబోయే వయసులో తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఉతాహ్​కి చెందిన క్యాథరిన్​ కోల్ వయసు ఇప్పుడు 97 ...


‘ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా పడిపోవచ్చు’

కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం ఉందన్నారు.


YS Jagan : పార్టీ ఓటమికి జగన్ బాధ్యత తీసుకోరా ? తప్పు తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం ఉండదా ?

Is Jagan not intending to review YCP defeat : వైఎస్ఆర్‌సీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ? . ఇప్పడా పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. 2019 ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. 2024 ఘోర ఓట‌మికి మాత్రం ఎలాంటి బాధ్య‌త తీసుకోవ‌డం లేదు. ఈవీఎంలను విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు మంచే చేశామంటున్నారు. బహిరంగసభల్లో చెప్పినవన్నీ మళ్లీ మళ్లీ చెబుతున్నారు....


సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా జోహన్నెస్​బర్గ్: సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా(71) రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆఫ్రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు రామఫోసాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో రామఫోసా....


మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత

ప్రజాప్రభుత్వంలో మహిళల ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. శ


Ration Card: రేషన్ కార్డు ఉన్న అలర్ట్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రేషన్ దుకాణాల్లో ఇప్పుడు కంది పప్పు, చక్కెర వంటివి పంపిణీ చేయరు. చంద్రబాబు సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. గుంటూరు తెనాలిలో రేష‌న్ స‌రుకులు నిల్వ చేసిన గోదాములో మంత్రి నాదెండ్ల మనోహర్ త‌నిఖీ చేశారు. కొన్ని అవకతవకలు ఉన్నట్లు ఆయన గమనించారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచదార, కందిపప్పు, నూనె వంటివి ప్యాకెట్‌కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బ‌రువు ఉన్న‌ట్లు ఆయ‌న గుర్తించారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించ‌గా.. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇకపోతే రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గడువు పొడిగించారు. ఇది వరకు జూన్ నెల చివరితో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే తర్వాత ఈ డెడ్‌లైన్‌ను పొడిగించేశారు. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. రెండింటి అనుసంధానానికి చాలా గడువు లభించింది. ప్రభుత్వం మరో మూడు నెలలు ఈ గడువు పొడిగించింది. అంటే సెప్టెంబర్ చివరి వరకు మీరు ఆధార్ రేషన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. అంటే ఇకేవైసీ చేసుకోకపోయినా కూడా మీ రేషన్ కార్డులు రద్దు కావు. చెల్లుబాటు అవుతూనే ఉంటాయని గుర్తించుకోవాలి. అయితే గడువు దగ్గర పడే వరకు వేచి చూడకుండా.. వెంటనే ఇకేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. రేషన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.


భారత ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం పొందే వ్యక్తి ఎవరు? ప్రధానమంత్రికైనా వాళ్ల తర్వాతనే!

మనదేశంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే విషయంలో ప్రధానమంత్రి ఐదో స్థానంలో ఉన్నారు. అయితే అసలు భారత ప్రభుత్వం ఏ వ్యక్తికి అత్యధిక జీతం ఇస్తుందో తెలుసా? వారు ఏ పదవిలో ఉన్నారు, ఎంత జీతం తీసుకుంటారు? భారత ప్రభుత్వం ద్వారా అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి రాష్ట్రపతి. రాష్ట్రపతికి ప్రతి నెల రూ. 5 లక్షల జీతం వస్తుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్సులు, అధికారిక నివాసంగా రాష్ట్రపతి భవన్, ప్రభుత్వ వాహనాలు, 24 గంటల భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారు. జీతం పరంగా ఉపరాష్ట్రపతి రెండవ స్థానంలో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కు నెలకు రూ. 4 లక్షల జీతం వస్తుంది. ఇది కాకుండా అనేక రకాల అలవెన్సులు, ప్రభుత్వ బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, 24 గంటల భద్రతా సిబ్బంది, వైద్య సదుపాయాలు తదితరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గవర్నర్ మూడో స్థానంలో ఉంటారు. భారత ప్రభుత్వం గవర్నర్‌కు రూ. 3.50 లక్షల జీతం ఇస్తుంది. ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్‌కు విలాసవంతమైన బంగ్లా, భద్రతా సిబ్బంది, సేవకులు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. నాలుగో స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. సీజేఐకి నెలకు రూ.2.80 లక్షల జీతం లభిస్తుంది. ఇవే కాకుండా రాజధాని ఢిల్లీలో అద్దె బంగ్లా, 24 గంటల భద్రతా సిబ్బంది, కారు వంటి సౌకర్యాలు కల్పించారు. జీతం విషయంలో దేశ ప్రధాని ఐదో స్థానంలో ఉంటారు. ప్రతి నెలా ప్రధాని రూ.1.66 లక్షల వేతనం పొందుతున్నారు. ఇందులో వివిధ రకాల అలవెన్సులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ వసతితో పాటు వారికి ఎస్పీజీ భద్రత, ప్రత్యేక నౌకలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.


వనపర్తి జిల్లాలో పురాతన రాతి శిల్పాలు లభ్యం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహానికి కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం కనిపిస్తున్నాయి.


బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు

బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు రాజన్న సిరిసిల్ల, వెలుగు :  బ్లడ్ డోనేషన్ క్యాంప్  నిర్వహణలో  సిరిసిల్ల పోలీసులు పాత్ర వెలకట్టలేనిదని  ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జల్లా  వైస్ ప్రెసిడెంట్ ప్రయాకరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని    సోసైటీ ఆధ్వర్యంలో జిల్ల...


మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క

మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి: మంత్రి సీతక్క     అన్ని ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తం     మహిళా సంఘాల వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్ హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు రూ. 20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు.  మహిళా శక్తి పథకం కింద ...


Tirumala: వేసవి సెలవులు ముగిసినా…తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం., విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నాకడ దారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15 వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకొనే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో., శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. ఇక గురువారం నుంచి యాత్రికుల తాకిడి విపరీతంగా పెరిగింది. సోమవారం జాతీయ సెలవు దినం కావడంతో భక్తుల రాద్దీ కొన సాగనుంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతోనిండిపోయాయి. ఇక నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో సైతం భక్తులు కిక్కిసారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపించి ఉంది. పాపవినాశనం వెళ్లే దారిలోని కల్యాణ వేదిక వరకు క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. వేసవి సేవలు ముగిసిన మొదటివారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం క్యూకట్టారు. జూన్ 17 వరకు సెలవులు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాదం, తాగునీటిని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, వాటర్‌ వర్క్స్‌ ఈఈ శ్రీహరి, చీఫ్‌ పీఆర్‌వో డాక్టర్‌ టి.రవి, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో అన్నప్రసాదం రాజేంద్ర, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, ఏవిఎస్‌వో సత్యసాయి గిరిధర్‌ తదితరులు రద్దీ మొదలైనప్పటి నుండి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.


కక్ష సాధింపునకే విద్యుత్తు కమిషన్‌

గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్‌ సర్కారు కమిషన్‌ వేసిందని రాష్ట్ర రెడ్‌కో మాజీ చైర్మన్‌ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా కమిషన్‌ చైర్మన్‌ వ్యవహరిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.


SIFKA | అంబానీ ఇంట పెండ్లికి.. సబ్బినాడు జ్ఞాపిక

అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంనగర్‌ నుంచి తరలి వెళ్లినవే.


నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు

నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనందా నది వద్ద ప్రమాదం      రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది వద్ద ప్రమాదం      మృతులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం సంతాపం రుద్రప్రయాగ్ :  ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఓ మినీ బస్సు అదుపు తప్పి అలకనందా నదిలోకి పడిపోవడంతో 12 మంది య...


పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పిన మంత్రి నారాయణ

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను సీఎం చంద్రబాబు తనపై ఉంచారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని వెల్లడించారు.


అన్నదాతల ఆందోళన

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.


మెరుగైన సేవలు అందించేందుకు కృషి

ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అనసూయ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.


సైబర్‌ నేరగాళ్ల లింకులకు స్పందించొద్దు..

సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ యూనో అప్లికేషన్స్‌ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.


Sahitya Akademi 2024 Yuva Puraskar: తెలంగాణ వాసికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం, రమేష్ కార్తీక్ నాయక్‌కు కేటీఆర్ కంగ్రాట్స్

న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి కె వైశాలి, హిందీ రచయిత గౌరవ్ పాండే సహా ప్రతిష్టాత్మకమైన యువ పురస్కారాన్ని అందుకోనున్న 23 మంది రచయితల పేర్లను సాహిత్య అకాడమీ శనివారం (జూన్ 15న) ప్రకటించింది. సంస్కృతంలో యువ పురస్కార విజేతను త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 2024 ఏడాదికిగానూ 24 మంది బాల సాహిత్య పురస్కార విజేతల జాబితాను ప్రకటించింది. 2024 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన వారిలో...


Telangana | ప్రభుత్వం పట్టించుకోదు.. పోలీసులు పనిచేయరు.. ప్రశాంత తెలంగాణలో అశాంతి జ్వాల

రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ చురుకైన కార్యకర్త మల్లేశ్‌యాదవ్‌ను భూతగాదాల ముసుగులో ప్రత్యర్థులు హతమార్చారు.


ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కారు కృషి

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బాడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


సొంత లాభం కొంత మానుకొని…

‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి పాటుపడవోయ్‌' అన్నది గురజాడ మాట. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన నకుల్‌ దత్తా ఈ మాటలకు ఉదాహరణలా కనిపిస్తాడు.


నేడు ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్‌ కోఠిలోని ఈడెన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆర్టిఫిషియల్‌ లింబ్‌, కాలిఫర్స్‌, ఫిట్‌మెంట్‌తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ్‌ సేవా సంస్థాన్‌ ట్రస్టీ డైరెక్టర్‌ దేవేంద్ర చౌబిసా, కో ఆర్డినేటర్‌ అల్కా చౌదరి తెలిపారు.


సమర్థవంతంగా సత్పతి విధులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా అక్టోబర్‌ 30న కరీంనగర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు.


ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు

ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ     ఎక్కడ? ఎలా? ఎంత మేర? పెంచాలనే దానిపై మార్గదర్శకాలు      బహిరంగ రేటుకు తగ్గట్టుగా ప్రభుత్వ మార్కెట్ విలువ పెంపు.. గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర..పట్టణాల్లోనూ      ఏరియాను బట్టి భూముల విలువ సవరణలు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూముల విలువలు పెరుగనున్నాయి....


Farmer Schemes: రైతులకు స్పెషల్ స్కీమ్.. 50 శాతం తగ్గింపు!

అన్నదాతలకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. వ్యవసాయం చేసే వారికి లేదంటే సాగు చేయాలని భావించే వారికి అదిరే బెనిఫిట్ ఉంది. ప్రభుత్వం ఏకంగా 50 శాతం రాయితీ అందిస్తోంది. వ్యవసాయ పరికరాలు లేదా వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది....


TTD Admissions : 10th పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. రేపే చివరితేది

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టెన్త్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. శిల్పకళలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.


సంతోష్​బాబు త్యాగం మరువలేనిది

సంతోష్​బాబు త్యాగం మరువలేనిది సూర్యాపేట, వెలుగు : దేశం కోసం కల్నల్​సంతోష్​బాబు చేసిన త్యాగం మరువలేనిదని 31వ తెలంగాణ బెటాలియన్ అధికారి కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంతోష్​​బాబు విగ్రహానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశం కోసం వీరమరణం పొందిన సంతోష్​​బాబు పేరు చరిత్రలో నిలిచిపోతుంద...


తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిలాల్లో వర్షాలకు ఛాన్స్

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. నేడు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. జూన్ 17 తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది.


వేతనాలు అందక పస్తులుంటున్నాం

వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని, అతి తక్కువ వేతనంతో ఆరుగాలం శ్రమిస్తున్నారన్నారు.