కుప్వారా జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్ మృతి, పలువురికి గాయాలు

కుప్వారా జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్ మృతి, పలువురికి గాయాలు

జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో సరిహద్దు వెంట శనివారం కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం చేసిన దాడికి భారత సైన్యం ధిటైన సమాధానం ఇచ్చింది. పాక్ బోర్డర్ యాక్షన్ టీంలో కమాండోలు, టెర్రరిస్టులు ఉన్నారు.

ఉగ్రవాదులు శనివారం ఉదయం ఇండియన్ ఆర్మీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా.. మేజర్ ర్యాంక్ ఆఫీస్ తో సహా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆపరేషన్స్ సైట్ నుంచి హాస్పిటల్ కు తరలించారు. కుప్వారాలో మూడు రోజుల్లోనే ఇది రెండో ఎన్ కౌంటర్. జమ్మూకాశ్మీర్ కొండ జిల్లాల్లో 40 మంది పాకిస్థానీ టెర్రరిస్టులు దాక్కున్నట్లు సమాచారం. వారిని పట్టుకోవడానికి ఇండియన్ ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించింది.

©️ VIL Media Pvt Ltd.

2024-07-27T05:51:16Z dg43tfdfdgfd