అదనపు టీఎంసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

అదనపు టీఎంసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

తొగుట, వెలుగు : రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులను ప్రారంభించాలని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కోసం బండారుపల్లి గ్రామంలో అధికారులు 90 ఎకరాల భూమిని సేకరించారు. అప్పుడు ఎకరకు రూ.13 లక్షలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి మొదటి విడతగా రూ.8 లక్షలు ఇచ్చారు.

మిగతా రూ.5 లక్షలు మరోసారి ఇస్తామని చెప్పి పనులు ప్రారంభించారు. మూడేండ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పెండింగ్​డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అదనపు టీఎంసీ పనులను ఆపి నిరసన వ్యక్తం చేశారు.

వెంటనే అధికారులు స్పందించి తమకు రావాల్సిన రూ.5 లక్షలు చెల్లించి పనులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు ఎల్లయ్య, దేవయ్య, చిన్న ఎల్లయ్య, నర్సింలు, బాల్ రాజు, దుర్గయ్య, రమేశ్ పాల్గొన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-06-11T05:50:37Z dg43tfdfdgfd