తెల్ల జిల్లేడు చెట్టు వేరులో వినాయకుడు.. ఒక్కసారి పూజిస్తే మీ దశ తిరిగినట్లే!

మన దేవతాగనంలో ప్రథముడైన గణపతిని విజ్ఞాలను తొలగిపోయేందుకు ఆరాధించడం వేద కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించిన ముందుగా కొలిచేది మాత్రం గణపతినే జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుడిని ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభవిస్తాం. ఆ ప్రతీకగానే శ్వేతార్క మూలంగా అనగా తెల్ల జిల్లేడు వృక్షకాండంగా ఆ వినాయక మూర్తి ఆవిర్భవించాడు. ప్రకృతికి తనకి అబేదమని స్వామి చాటి చెప్పాడు. సహజ సిద్ధమైన శ్వేతార్కముల గణపతి ఆలయం హనుమకొండ జిల్లా కాజీపేటలో కొలువై ఉంది. ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక దామంగా వెలుగొందుతుంది. రెండంచెలుగా ఉండే ఆలయం సువిశాలంగా ఉంటుంది. శ్వేతం అనగా తెలుపు,అర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పెరిగితే ఆ చెట్టు వేరు మూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణంలో చెప్పబడింది. తెల్ల జిల్లేడు వేరు మొదల నుంచి ఉద్భవించింది కనుక ఇక్కడ శ్వేతార్క మూల గణపతి అంటారని ఆలయ అర్చకులు సాయి కృష్ణ శర్మ తెలిపారు.

ఏపీలో మహిళలకు ఉచిత బసు ప్రయాణం.. చంద్రబాబు కీలక ప్రకటన?

ఈ విగ్రహాన్ని చెక్కడం కానీ మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, కల్పం అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అయినవోలు అనంత మల్లయ్య శర్మ 2009లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఒకనాడు కానిపాకంలోని గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న మల్లయ్య శర్మ, కాణిపాకం నుంచి తిరిగి వచ్చాక కాజీపేట సమీపంలోని సాయిబాబా దేవాలయంలో పూజారిగా సేవ చేయడం ప్రారంభించాడు.1999 ఏప్రిల్ 20న మల్లయ్య శర్మ నిద్రిస్తున్న సమయంలో తన కలలో శ్వేతార్క మూల గణపతి దర్శనమిచ్చాడు. నల్గొండలోని ఓ అడవి ప్రాంతంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ఉన్నట్లు అతనికి కలలో కనిపించగా, పీఠాధిపతుల సూచన మేరకు మరుసటి రోజు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ స్వామి వారిని జిల్లేడు చెట్టు వేర్లలో కనుగొన్నాడు.ఆ స్వామి వారిని అక్కడి నుంచి కాజీపేటకు తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు.

అహోబిలంలో వింత.. తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు!

2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా దేవాలయం నిర్మాణం చేసి ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ విగ్రహానికి పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచన్నీ అమర్చారు. ఆ గణపతి 64 రూపల్లో ఈ శ్వేతార్కముల గణపతి ఒక రూపమని అర్చకులు సాయి కృష్ణ శర్మ చెప్పారు.ఈ స్వామివారికి సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉంటాయని,ఇలాంటి శ్వేతార్క మూల గణపతి ఆలయం ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదన్నారు. నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకుంటారని తెలియజేశారు.

2024-06-11T04:41:55Z dg43tfdfdgfd