పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు

పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు

ఎల్కతుర్తి, వెలుగు: బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్‌ చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు సుకినే సంతాజీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ముప్పు మహేందర్, కాంగ్రెస్​నాయకులు తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T05:05:28Z dg43tfdfdgfd