బిగ్ బ్రేకింగ్ : విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు

బిగ్ బ్రేకింగ్ : విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో.. పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించిన విషయాలపై.. మీ పాత్ర ఏంటో చెప్పాలంటూ పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 

2024, జూన్ 30వ తేదీలోపు కేసీఆర్ సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది పవర్ కమిషన్. దీనిపై కేసీఆర్ బృందం స్పందించిందని.. జూలై 30వ తేదీలోపు సమాధానం ఇవ్వటానికి సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు కమిషన్ వెల్లడించింది. 

జూన్ 30వ తేదీలోపు సమాధానం చెప్పాలని కమిషన్ స్పష్టం చేసింది. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని కమిషన్ వివరించింది. జూన్ 30వ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంది కేసీఆర్.. ఆ సమాధానంపై కమిషన్ సంతృప్తి చెందకపోతే.. నేరుగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది కేసీఆర్. 

భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా కేసీఆర్ పాత్రపై ఉన్న అనుమానాలు, లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T08:51:08Z dg43tfdfdgfd