రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోండి: అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోండి: అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్ ఫోర్స్ మెంట్ ను బలోపేతం చేసి చెక్ పోస్టుల దగ్గర నిరంతరం నిఘా  ఉంచాలన్నారు. 2024,  జూన్ 11వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రవాణాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్కూల్ బస్సు ఫిట్ నెస్ పై వరుసగా తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. 

రవాణాశాఖలో చట్టానికి లోబడి రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలో సీఎన్జీ,  ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు ప్రోత్సహించేలా పాలసీ రూపొందించాలన్నారు. ఇక సమావేశానికి రాని అధికారులకు నోటీసులివ్వాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు మంత్రి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డిసెంట్రలైజ్ విధానం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్.

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T15:37:10Z dg43tfdfdgfd