వైరా రిజర్వాయర్ కాల్వలు రిపేరు చేయాలి

వైరా రిజర్వాయర్ కాల్వలు రిపేరు చేయాలి

  •     ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుకు రైతుల వినతి

వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ ఆయకట్టు కాల్వలతోపాటు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న కాల్వలకు రిపేర్లు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం, రిజర్వాయర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైరా ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు ప్రధాన కాల్వలు, పంట కాల్వలు నీరు ప్రవహించే పరిస్థితి లేదన్నారు. డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి కాల్వలు బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు వనమా చిన్న సత్యనారాయణ, వైరా పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సీపీఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు హరి వెంకటేశ్వరరావు, బెజవాడ వీరభద్రం, మాడపాటి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T04:05:18Z dg43tfdfdgfd