HARISH RAWAT | మోదీ ౩.౦పై హరీష్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు

Harish Rawat : ఎన్డీయే ప్రభుత్వంపై ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రివర్గం కొలువుతీరిందని, కానీ ఈ ప్రభుత్వం పరస్పర వైరుధ్యాలున్న వారితో నిండిపోయిందని అన్నారు.

పార్టీలు మార్చడంలో నిష్ణాతులైన నేతలు ప్రభుత్వంలో ఉన్నారని నితీష్ కుమార్‌, చంద్రబాబు నాయుడు వంటి నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు మోదీకి సంకీర్ణ సర్కార్‌ నడపడంలో ఇబ్బందులు తప్పవని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంతకుముందు చత్తీస్‌ఘఢ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేష్‌ బఘేల్‌ పేర్కొన్నారు.

Read More :

Shatrughan Sinha | సోనాక్షి సిన్హా వివాహంపై మౌనం వీడిన శత్రుఘ్న సిన్హా

2024-06-11T13:46:14Z dg43tfdfdgfd