OLD CITY BONALU 2024 : లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!

Old City Lal Darwaza Bonalu Jatara 2024: పాతబస్తీలో సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింహవాహిని ఆలయంతో పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జూలై 28 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు.  4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.   

శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చార్మినార్ లో శ్రీ భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో  మంత్రి దామోదర రాజనర్సింహ, మిరాలం మండి శ్రీ మహంకాళి టెంపుల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జి మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ శ్రీ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Also Read: రోజూ ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు పాటించాల్సిన 6 ముఖ్యమైన విధులివే..ఎందుకంటే!

జూలై 29 అర్థరాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా  2,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు . పాతబస్తీలో ఫలక్‌నుమా, చార్మినార్‌, బహుదుర్‌పురా,మీర్‌చౌక్‌  ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జూలై 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం సోమవారం రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్‌ వరకు తెల్లవారుజామునుంతి అర్థరాత్రి వరకూ కొనసాగనున్న ఈ భారీ ర్యాలీలో ఏనుగుపై ఉరేగింపు ఉంటుంది 

Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!

 

వాహనాల మళ్లింపు 

  • హిమ్మ‌త్‌పుర నుంచి షంషీర్‌గంజ్ వైపు వెళ్లే వాహ‌నాల‌ు గౌలిపురా, సుధా టాకీస్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు
  • చాంద్రాయ‌ణ‌గుట్ట‌, ఉప్పుగూడ వైపు నుంచి నగరంలోకి వచ్చే వాహ‌నాల‌ను గౌలిపురా , నాగుల్‌చింత మీదుగా మ‌ళ్లించ‌నున్నారు
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎక్స్ రోడ్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను జ‌హ‌నుమా, గోశాల‌, తాడ్‌బ‌న్, ఖిలావ‌త్ మీదుగా మళ్లిస్తారు
  • ఇంజిన్ బౌలి నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను షంషీర్‌గంజ్ వైపు దారి మళ్లింపు
  • చార్మినార్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను హ‌రిబౌలి వ‌ద్ద దారి మళ్లిస్తారు
  • చాద‌ర్‌ఘాట్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ు పురానా హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జ్ వ‌ద్ద మళ్లిస్తారు
  • మొఘ‌ల్‌పురా, మీర్ చౌక్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ు మీర్ కా డ‌యారా వైపు మ‌ళ్లించ‌నున్నారు.

బోనాల జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలివే

  • శాలిబండ‌లో దేవి ప్లేవుడ్
  • నాగుల‌చింత‌లో అల్కా థియేట‌ర్ ఓపెన్ ప్లేస్
  • అపోజిట్ సుధా థియేట‌ర్ లేన్ లో ఆర్య వైశ్య మందిర్
  • వీడీపీ స్కూల్ గ్రౌండ్, చార్మినార్ బ‌స్ టెర్మిన‌ల్, ఢిల్లీ గేట్

ప్రత్యేక బస్సులు

సింహ వాహిని మహంకాళి లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు కలుగకుండా వంద ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు. లాల్‌ దర్వాజ ఆలయం, ఎంజీబీఎస్‌, రేతిఫైల్‌, జేబీఎస్‌ల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని...సమాచారం కోసం  9959226154, 9959 226160 నంబర్లను సంప్రదించాలని కోరారు.

 Also Read: ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!

2024-07-27T03:46:39Z dg43tfdfdgfd