SAMPARK KRANTI EXPRESS | వేగంగా రైలు నడిపినందుకు ఇద్దరు లోకో పైలట్లపై సస్పెన్షన్‌ వేటు

Sampark Kranti Express : నిబంధనలను ఉల్లంఘించి రైలును వేగంగా నడపడం ద్వారా ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసినందుకు ఇద్దరు లోకో పైలట్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని వారిపై చర్యలు తీసుకున్నారు.

ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర సెక్షన్‌కు చెందిన లోకో పైలట్‌లు గంటకు 20 కిలో మీటర్ల వేగంతో రైలును నడపాలన్న ఆదేశాలను ఉల్లంఘించారు. పూర్తి వేగంతో రైలును నడపారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైల్వే వంతెన పాతది కావడం, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం జరుగుతుండటంతో మధుర రైల్వే సెక్షన్‌లో స్పీడ్‌ కంట్రోల్‌ విధించారు.

ఈ నిబంధన ప్రకారం ఆ మార్గంలో రైలు కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంది. కానీ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్ వేగ పరిమితిని విస్మరించాడు. అతను ట్రాక్‌పై పూర్తి వేగంతో రైల్వే వంతెనను దాటాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. విషయం తెలిసిన తర్వాత ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

2024-07-26T14:48:15Z dg43tfdfdgfd