అద్దె భవనం.. అరకొర వసతులు

దుబ్బాక, జూలై 26: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండేది. అక్కడ సరైన వసతులు లేక దుబ్బాకకు తరలించారు. ఇందులో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రస్తుతం 475 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

నెలకు రూ.2.27 లక్షలు అద్దె చెల్లిస్తున్నప్పటికీ సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన తరగతి గదుల్లోనే విద్యనభ్యసిస్తూ…మరోపక్క బస చేస్తున్నా రు. తరగతి గది, వసతి గది ఒక్కటే కావడం సమస్యగా మారింది. కనీసం చదువుకునేందుకు బెం చీలు, డెస్క్‌లు లేక నేలపైనే చదువులు కొనసాగుతున్నాయి. 475 మంది విద్యార్థులకు కేవలం 12 చొప్పున మరుగుదొడ్లు, స్నానపు గదులు మాత్ర మే ఉన్నాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

2024-07-26T21:19:19Z dg43tfdfdgfd