నిత్య సాధనతో నైపుణ్యం

  • అంతర్జాతీయ క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి
  • పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా
  • ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు
  • సింగిల్స్‌ విజేతలు కీర్తి, శశాంక్‌

హనుమకొండ చౌరస్తా, జూలై 26 : నిత్య సాధనతో నైపుణ్యం పెంపొందుతుందని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వరంగల్‌ సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అండర్‌-17 బాలబాలికల బ్యాడ్మింటన్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. హనుమకొండలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సీపీ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ.. క్రీడాకారులు ఎప్పటికప్పుడు టెక్నిక్స్‌ను ఉపయోగిస్తూ క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పింగిళి రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్‌, నిర్వహణ కార్యదర్శి జితేందర్‌రెడ్డి, వరంగల్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, క్రీడా పరిశీలకుడు సుధాకర్‌, అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మోహన్‌రావు, అసోసియేషన్‌ బాధ్యులు, టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కొమ్ము రాజేందర్‌, వైకుంఠం, రాజ్‌కుమార్‌, దుర్గాప్రసాద్‌, విశ్వప్రకాశ్‌ పాల్గొన్నారు.

చాంపియన్స్‌ వీరే..

అలాగే బాయ్స్‌ సింగిల్స్‌లో శశాంక్‌ వనమాల(రంగారెడ్డి) సాయి నచికేత్‌ భరత్‌రాజు(మెదక్‌)పై వరుస సెట్లలో.. గర్ల్స్‌ సింగిల్స్‌లో కీర్తి మంచాల(జనగామ) ఆలూరు అక్షయ చౌదరి(మెదక్‌)పై గెలుపొందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీఆదిత్య బొమ్మకంటి -రిషితాపాండే(రంగారెడ్డి) జే శౌర్యకిరణ్‌-కీర్తి మంచాల(జనగామ)పై గెలుపొందారు. బాయ్స్‌ డబుల్స్‌లో సాయి సిద్ధార్థ రాయప్రోలు-యువసూర్య జాగర్లమూడి(హైదరాబాద్‌) జోడీ ధుృవపర్షద్‌ సేథీ-వివేక్‌ బొల్లం(రంగారెడ్డి)పై విజయం సాధించారు. గర్ల్స్‌ డబుల్స్‌లో లక్ష్మీ రిధిమా దేవినేని-సరయు సూర్యనేని(హైదరాబాద్‌) జోడీ అనుసంజన మురళీ-గాదె శృతి గ్రేస్‌రెడ్డి(రంగారెడ్డి)పై గెలుపొందింది.

2024-07-26T23:34:39Z dg43tfdfdgfd