పారిస్‌ ఒలింపిక్స్: ఘనంగా ఆరంభ వేడుకలు, భారత బృందానికి సారథ్యం వహించిన పీవీ సింధు, శరత్ కమల్...

పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంలో కాకుండా తొలిసారి ఒక నది పక్కన జరిగిన ఈ వేడుకల్లో భారత క్రీడా బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌లు సారథ్యం వహించారు.

జాతీయ జెండాతో పీవీ సింధు బోటులో నిల్చుని కనిపించింది.

భారతీయ ఆటగాళ్లందరూ చేతుల్లో జాతీయ పతకాన్ని పట్టుకుని కనిపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది జరుగుతున్న ఒలింపిక్స్‌ కోసం భారత్ 117 మంది ఆటగాళ్లను పారిస్‌కు పంపించింది.

మొట్టమొదటిసారి ఈ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో ఉన్న సెన్ నదీ తీరంలో జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్‌కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.

భారత ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పారిస్ ఒలింపిక్స్ వేడుకల దృశ్యాలు

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-07-27T02:52:16Z dg43tfdfdgfd