భౌ..భౌ

  • హడలెత్తిస్తున్న కుక్కలు
  • గుంపులు గుంపులుగా సంచారం
  • రక్తం రుచిమరిగి ప్రజలపై దాడులు
  • జంకుతున్న పిల్లలు..భయాందోళనకు గురవుతున్న పెద్దలు
  • కుక్కల దాడులు పెరిగినా పట్టించుకోని అధికారులు

గజ్వేల్‌/కోహెడ, జూలై 26: గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. కుక్కల భయానికి చిన్నాపెద్ద తే డా లేకుండా అందరూ భయపడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎక్కువగా పిల్లలు గాయపడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏటా కుక్కల దాడిలో గాయాలవుతున్న వారు సుమారుగా 5వేలకుపైగా ఉంటున్నారు. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రజ లు గల్లీల్లో కాలినడకన వెళ్లాలంటే భయపడుతున్నారు. గుంపులుగా కుక్కలు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని భయపడుతున్నారు.

కు క్కల కట్టడికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల దాడులు పెరిగాయి. పట్టణాలు, గ్రామాల శివారు ప్రాంతాల్లో కోళ్ల వ్యర్థాలు, కోళ్ల ఫారాల నిర్వాహకులు చనిపోయిన కోళ్లను పాడేస్తున్నారు. కుక్కలు వాటిని ఆహారంగా తీసుకొని రక్తం రుచిమరుగుతున్నాయి. గుంపులుగా సంచరిస్తూ కనిపిచ్చిన వారినల్లా కరుస్తున్నారు. ఎక్కువగా పిల్లలు వాటి బారినపడుతున్నారు. కాలనీలు, గ్రా మాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే అరుస్తూ దాడికి పాల్పడుతున్నాయి. గజ్వేల్‌ పట్టణంలో ఉద యం, రాత్రి సమయంలో కాలినడకన వెళ్లే వాళ్లు కుక్కల కారణంగా భయంతో ముం దుకు సాగుతున్నారు.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కుక్కలకు కు.ని. ఆపరేషన్లు చేసి వాటిని నియంత్రించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జూన్‌ 29న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో బీహార్‌ వలస కుటుంబానికి చెందిన విశాల్‌(6)పై వీధికుక్కలు దాడిచేసి దారుణంగా చంపాయి. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, రామాయంపేట, సంగారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు.

కోహెడ మండలంలో వీధి కుక్కలు స్కూల్‌ పిల్లలు, బాటసారులపై దాడి చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ కోహెడ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ఇటీవల మీడియా ఎదుట వాపోయాడు. తరుచూ స్కూల్‌ పిల్లలపై, బాటసారులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నట్లు ఆయన తెలిపాడు. అధికారులు కుక్కల బారి నుంచి కాపాడాలని ఆయన కోరారు. కోహెడ రహదారులపై రాత్రిపూట వాహనాలపై వెళ్త్తున్న వారిపైకి వస్తుండటంతో వాహనాలపై నుంచి పడి గాయపడుతున్నట్లు తెలిపారు. జంతు యాక్టు ఉన్నప్పటికీ ఇతర మార్గాలు అన్వేషించి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని ఆయన కోరారు.

2024-07-26T20:49:16Z dg43tfdfdgfd