మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం

మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం

వర్ధన్నపేట (ఐనవోలు ), వెలుగు : సరదా ఆట ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు(27) ట్రాక్టర్​మెకానిక్​ షెడ్​రన్​ చేస్తున్నాడు. గురువారం షెడ్​లో పని చేసుకుంటుండగా ఇతడికి వరుసకు బావ అయ్యే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆట పట్టించాలని యువకుడి మలద్వారం దగ్గర హైడాల్రిక్ ఎయిర్ ప్రెషర్ పెట్టి గాలి వదిలాడు.

కొద్దిసేపటికే అతడు అస్వస్థతకు గురికాగా స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్​లోని ప్రైవేట్​దవాఖానకు తీసుకువెళ్లారు. పెద్ద పేగులో గాలి చేరడంతో  డాక్టర్లు ఆపరేషన్ ​చేశారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-27T02:05:40Z dg43tfdfdgfd