Trending:


Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.


ఖైరతాబాద్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఖైరతాబాద్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు ఖైరతాబాద్‌ బడా గణేశ్​పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం నుంచి ఈ నెల 17న నిమజ్జనాలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కొన్ని రోడ్లను పూర్తిగా క్లోజ్​చేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్‌ విశ్వప్రసాద్‌ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల ...


Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్

కామారెడ్డి జిల్లా పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రీల్స్, వీడియోల కోసం పామును నోట్లో పెట్టుకున్న మోచి శివరాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతను స్థానికంగా స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బెజవాడలో మళ్లీ వర్షం .. భయాందోళనలో ప్రజలు

బెజవాడలో మళ్లీ వర్షం .. భయాందోళనలో ప్రజలు విజయవాడలో శనివారం ( సెప్టెంబర్​ 7)  ఉదయం నుంచి మళ్లీ వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, వన్‌ టౌన్‌, గవర్నర్‌ పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, పటమట, కృష్ణలంక, కానూరు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మళ్లీ...


AP Floods Damage : ఏపీలో వరద నష్టం ప్రాథమిక అంచనా రూ.6882 కోట్లు-సోమవారం నుంచి మూడ్రోజుల పాటు నష్టం గణన

AP Floods Damage : ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఏపీ భారీగా నష్టపోయింది. సుమారు రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్రానికి పంపనుంది. అలాగే సోమవారం నుంచి మూడ్రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


అక్కడ గంజాయి సాగుకు ప్రభుత్వం అనుమతి.. ఇక ఎలాంటి అడ్డంకులు లేవు..!

ఇంతకాలం రహస్యంగా, చట్టవిరుద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు.. ఇక చట్టబంద్ధం కానుంది. మీరు దీనిని మొదట నమ్మలేకపోవచ్చు.. కానీ ఇది నిజం. భారత దేశంలోని ఒక రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబంద్ధం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇందులో ఎలాంటి అబద్ధం లేదు.హిమాచల్ ప్రదేశ్ లో ఇకపై గంజాయిని చట్టబద్ధంగా పండించనున్నారు. ప్రభుత్వ అనుమతితో సాగు ప్రారంభించాలి. గంజాయి సాగు ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి...


ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు

ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి..


Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

Budameru Leakage : బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆర్మీ సాయంలో పెద్దదైన మూడో గండిని శనివారం పూడ్చి వేశారు. ఇటీవల భారీ వర్షాలకు బుడమేరుకు మూడు చోట్ల గండి పడింది. ఈ గండ్ల వలన విజయవాడ ముంపునకు గురైంది.


ముషారఫ్ భూమిని అమ్మేసిన భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌లో ఉన్నది కాదు ఇక్కడిదే !

Ex-Pakistan President Parvez Musharraf s land in UP : పాకిస్తాన్ మాజీ మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఇండియాలో ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఉన్న ఒక ఆస్తిని ప్రభుత్వం వేలం వేసేసింది. యూపీలోని కొటానా అనే గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని రూ. కోటి ముఫ్పై ఎనిమిది లక్షలకు వేలం పాటలో ఇతర వ్యక్తులు దక్కించుకున్నారు. రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర అవుతుంది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయిన ముషారఫ్ కుటుంబం పాకిస్తాన్ మిలటరీ చీఫ్ గా కూడా పని చేసిన...


Rhinoceros: ఇదేక్కడి విడ్డూరం.. సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సష్టమెంత?

ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన్నట్లుగా పరిస్థితి మారింది.


తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు

తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు వరదలతో  ఇప్పటివరకు 29 మంది మృతి  సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హైలెవల్​ మీటింగ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి, తగిన సహాయ, పునరావాస చర్యలు చ...


CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన

CM Chandrababu Visit Flood Affected Areas In Vijayawada: గత ప్రభుత్వ పాపాన్ని ఈ రోజు కరెక్ట్ చేశామని.. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలేసిన పాపం నేడు మనకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏడో రోజు పర్యటించారు. అనంతరం విజయవాడ (Vijayawada) కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాపాలు.. రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయని మండిపడ్డారు. అప్పటి వైసీపీ...


గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్

గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్ ఆరోగ్య సమస్యలే కారణమంటూ దూకడానికి ముందు సెల్ఫీ వీడియో  గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసుల గాలింపు భద్రాచలం, వెలుగు : ఆరోగ్య సమస్యలు భరించలేక ఒక కానిస్టేబుల్ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. ఆయన కోసం గజఈతగాళ్ల సాయంతో నదిలో పోలీసులు గాలిస్తున్నారు. పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఆరోగ్య సమస్యలతో ఆ...


GHMC పరిధిలోకి 51 గ్రామాలు.. ORR-RRR మధ్య రేడియల్‌ రోడ్లు, భూముల ధరలకు రెక్కలు

జీహెచ్‌ఎంసీ పరిధి మరింత పెరగనుంది. నగరం చుట్టూ ఉన్న 51 గ్రామాలు జీహెచ్‌ఎంసీలో కలవనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నారు.


రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు.

రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం జరిగింది.. కొంతమంది దుర్మాఅప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు.. శిశువు అరుపులు విని  గమనించిన స్థానికులు...  సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అమ్మ కడుపులోంచి బైటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైనా చూడనేలేదు. అమ్మ పేగు తెంచుకుని పుట్టిన...


నాచారం పెయింట్​ కంపెనీలో అగ్నిప్రమాదం

నాచారం పెయింట్​ కంపెనీలో అగ్నిప్రమాదం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మల్లాపూర్.. నాచారం  పారిశ్రామిక వాడలో శని...


నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏకంగా 11 రోజులు

వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు.. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ...


నటుడు మురళీమోహన్‌ ఆస్తులపై హైడ్రా ఫోకస్.. జయభేరీ సంస్థకు నోటీసులు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తూ.. హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే.. హైడ్రా పంపిస్తోన్న బుల్డోజర్లు.. ఏ రాజకీయ నేతల బెదిరింపులకు, సినీ ప్రముఖుల పాపులారిటీకి ఆగిపోవటం లేదు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా.. ఇప్పుడు సీనియర్ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరీపై ఫోకస్ చేసింది.


Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

Krishna River Projects : తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తో్న్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణనది ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తు్న్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ప్రాజెక్టుల గేట్లు దాదాపుగా తెరిచే ఉంచుతున్నారు.


బలంగా అల్పపీడనం.. నేడు ఆ ప్రాంతాల్లో అత్యంత అతి భారీ వర్షాలు

Weather Report 8-9-2024: భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోంది. ఇది ఉత్తరం వైపుగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుంది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర ఉంటుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి మరో 4 రోజులు కొనసాగనుంది. ఈ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా పడతాయి. ఇవాళ (8వ తేదీ) మాత్రం కోస్తాంధ్రలో అత్యంత అతి భారీ వర్షాలు (extremely heavy rainfall) కురుస్తాయి. అలాగే తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 8, 9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. 10వ తేదీన తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి. శాటిలైట్ అంచనాలను చూస్తే, అల్పపీడనం ప్రభావం.. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇవాళ కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలపై రోజంతా మేఘాలు ఉంటాయి. ఇవాళ హైదరాబాద్‌లో వాన పడే అవకాశాలు కనిపించట్లేదు. కానీ మేఘాలు ఎక్కువగానే ఉంటాయి. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 45 కిలోమీటర్లకు చేరింది. ఏపీలో గంటకు మాగ్జిమం 20 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలో మాగ్జిమం 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ టూర్లకు వెళ్లేవారికి గాలి బాగా వీస్తుంది. పర్యాటకులకు చాలా బాగుంటుంది. ఐతే.. వర్షం పడని ప్రాంతాలకు వెళ్లడం మేలు. ఉష్ణోగ్రతలు చూస్తే, ఏపీలో మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ దాటదు. తెలంగాణలో 30 డిగ్రీల సెల్సియస్ దాటదు. మేఘాలు, గాలి కారణంగా.. ఉక్కపోత అనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది. ఉదయం వేళ తెలంగాణలో 89 శాతం, ఏపీలో 89 శాతం ఉంటుంది. రాత్రి 7 తర్వాత తెలంగాణలో 83 శాతం, ఏపీలో 79 శాతం తేమ ఉంది. ఉత్తరాంధ్ర, ఈశాన్య తెలంగాణలో తేమ 90 శాతానికి పైగా ఉంది. అందువల్ల ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. (All Images credit - IMD)


Heavy rains: మరోసారి ఖమ్మంకు వాతావరణ శాఖ కీలక అలర్ట్..

Imd alert: ఇప్పటికే ఖమ్మంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. పోలీసులు మైక్ లలో అప్రమత్తం చేస్తున్నారు.


జైనూర్‌‌లో హైఅలర్ట్‌‌.. కొనసాగుతున్న పోలీస్‌‌ పహారా

జైనూర్‌‌లో హైఅలర్ట్‌‌.. కొనసాగుతున్న పోలీస్‌‌ పహారా ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్‌‌ జిల్లా జైనూర్‌‌లో ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్త్‌‌ ఏర్పాటు చేశారు. జైనూర్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వరుసగా రెండో రోజు ఏ ఒక్కరినీ ఊర్లోకి అనుమతించలేదు. వదంతులు ప్రబలకుండా ఇంటర్నెట్‌‌ను పూర్తిగా నిలిపివేశారు. అడిషనల్‌‌ డీజీ డీజీ మహేశ్‌‌ భగవత్...


వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి

వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి జీడిమెట్ల :  వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. పేట్​బషీరాబాద్ పీఎస్​ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్​చారి(28) బస్సు బాడీ లేబర్  పనిచేస్తుంటాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. మండపం పై నుంచి వర్షం నీరు కిందికి రాకుండా టార్ప...


పితృ పక్షం ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం..!

సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17.. మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది.. అమావాస్య తిథి ముగింపును సూచిస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణాలు చేస్తారు, అయితే మీ ఇంట్లో పూర్వీకులు మీ పై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం.అయోధ్య...


Eluru : వ‌రస‌కు చెల్లిలైన‌ బాలికపై యువ‌కుడు అత్యాచారం.. పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

Summary: ఏలూరు జిల్లాలో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన యువ‌కుడి కేసులో.. పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. యువ‌కుడికి జీవితకాల జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జ‌రిమాన విధించింది. బాధితురాలికి న‌ష్ట ప‌రిహారం రూ.3 ల‌క్ష‌ల చెల్లించాల‌ని ఏలూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.


Tenali Crime News: తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో చావునుండి జస్ట్ మిస్సయిన ముగ్గురు వీరే

Tenali Cyanide Murders | గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన లేడీ కిల్లర్స్ చేసిన హత్యల గురించి వింటుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ కి చెందిన ముడియాల వేంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే 32 ఏళ్ల మహిళ తన తల్లి రమణమ్మ మరో కొంతమంది తో కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడి నాలుగు హత్యలు చేశారు. ఇందులో బుజ్జి అత్తగారు సహా వారికి అప్పు ఇచ్చిన మరో వృద్ధురాలు, షేక్ నాగూర్ బీ అనే పక్కింటావిడను బంగారం డబ్బు కోసం కూల్ డ్రింక్ లో సైనైడ్...


సూరారంలో 25 అడుగుల మట్టి గణపతి

సూరారంలో 25 అడుగుల మట్టి గణపతి కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గం సూరారం భవానీనగర్​లో శ్రీవినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 25 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 35 ఏండ్లుగా భవానీనగర్​లో గణేశ్​ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 14 ఏండ్లుగా ఇక్కడ భారీ మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి 25 అడుగుల్...


వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుడికి జనసేనాని పూజలు

వినాయకచవితి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు.


సెలవుల్లేకుండా 104 రోజుల డ్యూటీ - చనిపోయిన ఉద్యోగి - చైనాలో ఇలాంటివి మామూలేనా ?

China Man dies of organ failure after working for 104 days : చైనాలో వర్క్ ఫోర్స్ చాలా చీప్ గా వస్తుందని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫ్యాక్టరీలను పెడుతూ ఉంటాయి. లేబర్ చట్టాలు కూడా అంత కఠినంగా ఉండవు. అందుకే చైనా తయారీ రంగానికి కేంద్రంగా మారింది. కానీ మరి ఆ పరిశ్రమల్లో పని చేసే వారి పరిస్థితి ఏమిటి ?. ఎలా చచ్చిపోయినా బయటకు తెలియదు. కానీ ఇటీవల కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అవన్నీ ఇంత ఘోరమా అనిపించేలా ఉంటున్నాయి. తాజాగా ఓ కంపెనీలో పని చేస్తున్న...


Kargil War: అవును, కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు పాతికేళ్లకు ఒప్పుకున్న పాక్

Kargil War: భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి ఇటీవలె 25 ఏళ్లు పూర్తయింది. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని దాయాది పాక్ చేసిన ప్రయత్నాన్ని.. ఇండియన్ ఆర్మీ గట్టిగా తిప్పికొట్టింది. అయితే ఈ ఘటన జరిగి పాతికేళ్లు పూర్తయినా ఇప్పటివరకు.. కార్గిల్ యుద్ధం చేసింది తామే అని ఇప్పటివరకు పాకిస్తాన్ అంగీకరించలేదు. కానీ తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా.. ఒప్పుకోవడంతో ఇన్నేళ్లపాటు దాగుడుమూతలు ఆడిన పాక్ బాగోతం బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?


YS Jagan Questions : 'చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?' - జగన్ 8 ప్రశ్నలు

YS Jagan Questions to CM CBN : ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని... అసలు ప్రభుత్వం ఉందా..? లేదా..? అని నిలదీశారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయాలని డిమాండ్ చేశారు.


Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్‌.. బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్స్‌

Balapur Laddu Auction Rules: వేలంతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బాలాపూర్‌ లడ్డూలో కీలక మార్పులు జరిగాయి. వేలంలో పాల్గొనేవారికి నిర్వాహకులు కీలకమైన సూచనలు చేశారు.


ఖైరతాబాద్ బడాగణపతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడాగణపతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ సిటీలో గణేస్ చతుర్థి పురస్కరించుకొని గల్లీగల్ళీకో గణేషులు కొలువు దీరారు. హైదరాబాద్ ఫేమస్ గణేషుడు ఖైరతాబాద్ బడాగణపతికి తొలిపూజ నిర్వ హించారు నిర్వాహకులు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ బడా గణేషుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు...


ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరం అయితే 1077కి కాల్ చేయండి తెలంగాణలో మరోసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన ఖమ్మం, మహబూబాబాద్ .. ఈ భయానక పరిస్థితులనుంచి కోలుకోకముందే మరోసారి ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ( సెప్టెంబర్ 7) సాయంత్రం నుంచి మహబూబాబాద్, ఖమ్మం  జిల్లాల్లో కుండపోత వ...


Drugs | పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసుల దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌లో ఉన్న కోరం క్లబ్‌, బేజీలోన్‌ పబ్‌తోపాటు మరో మూడు పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.


ఆకర్షిస్తున్న 10 అడుగుల ఎత్తైన చాక్లెట్ వినాయకుడు!

శ్రీకాకుళంలోని అంపోలు గ్రామంలో చాక్లెట్లతో తయారుచేసిన ఒక వినాయకుని ప్రతిష్టించడం జరిగింది. ఈ వినాయకుడు తయారీకి 40 కేజీల వరకు చాక్లెట్లు వాడారు. ఆ వినాయకుడి ప్రత్యేకతలు లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపోలు గ్రామంలోని దిగువ వీధి గణేష్ యూత్ ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుని తయారుచేసి మండపంలో పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని ప్రత్యేకించి చాక్లెట్లతో తయారుచేసి 10...


Tirumala : తిరుమలలో మరిన్ని మార్పులు..! ఇకపై 'ఆధార్' ప్రామాణికంగా సేవలు - టీటీడీ తాజా నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రాథమికంగా కేంద్రం నుంచి అనుమతి లభించిందని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.


తిరుమలలో తీవ్ర విషాదం.. శ్రీవారి దర్శన క్యూలైన్ కాంప్లెక్స్‌లో భక్తురాలు మృతి

Tirumala Devotees Died Of Heart Attack: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించే ప్రయత్నించారు.. కానీ అప్పటికే ఆమె చనిపోయారు. ఝాన్సీది కడపజిల్లా కాగా.. లండన్‌లో స్థిరపడ్డారు. ఈ ఘటన తీవ్ర...


దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది

దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది షాద్ నగర్: పందులు దొంగలించడాన్ని చూశాడని ఆరేళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని హాజీపల్లి రోడ్ లో కొంతమంది జీవనోపాధి కోసం ఎంతో కాలంగా గుడిసెలు వేసుకొని పందుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందులను ద...


Budameru | బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి .. ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ జనం

Budameru | విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి.


Khammam Rains : భారీ వర్షాలు - మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధృతి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్..!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Leopard Warning: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్, చిరుత పులి ఉంది బయటకు రావద్దు

Leopard Warning: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్. సాయంత్రం 6 దాటితే బయటకు తిరగవద్దు. ఇంట్లో తలుపులు వేసుకుని ఉండాలి. రాత్రి పూట ఒంంటరిగా వెళ్లవద్దు. టార్చ్ లైట్ లేకుండా అసలు వెళ్లవద్దు. అసలు ఏం జరిగింది..ఎందుకీ హెచ్చరికలు.


Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

వినాయకచవితి ఉత్సవాలకు (Ganesh Festival) సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.


వరద విలయం నుంచి తేరుకుంటున్న విజయవాడ ఇప్పుడు ఎలా ఉందో చూపే కొన్ని చిత్రాలు..

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది.


Gold: బంగారం ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా? భూమిపైన అస్సలు కాదంట!!

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఉండాలే కానీ వొళ్లంతా బంగారంతో నింపేసుకుంటారు. అయితే అసలు ఈ బంగారం భూమిపైకి ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు? అసలు బంగారం భూమిపైకి ఎలా వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. తాజాగా ఓ అధ్యయనం దీనిపై క్లారిటీ ఇచ్చింది. గతంలో వచ్చిన అధ్యయనాలను కాదని స్పష్టమైన ప్రకటన చేసింది. గత నివేదికలు ఏం చెబుతున్నాయంటే.. భూమి క్రస్ట్‌లో పగుళ్ల ద్వారా ప్రవహించే వేడి, ఖనిజాలు అధికంగా ఉండే ద్రవాల నుంచి ఏర్పడతాయని భావించారు. ఈ ద్రవాలు చల్లబడినప్పుడు.. బంగారం అవక్షేపించబడి చుట్టుపక్కల ఉన్న క్వార్ట్జ్‌లో పేరుకుపోతుందని తెలుపుతున్నాయి. అయితే ఇలా జరిగితే తక్కువ మొత్తంలోనే బంగారం పుడుతుంది. ఈ సిద్ధాంతం పెద్ద మొత్తంలో బంగారం ఏర్పడటాన్ని వివరించడంలో ఫెయిల్ అయింది. ప్రత్యేకించి ఈ ద్రవాలలో సాధారణంగా బంగారం తక్కువగా ఉండటం కారణంగా ఈ థియరీ ఫెయిల్ అయింది. డాక్టర్ క్రిస్ వోయిసీ నేతృత్వంలోని తాజా అధ్యయనం ప్రకారం.. భూకంపాలు క్వార్ట్జ్ లోపల పైజోఎలెక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం ద్వారా బంగారు నగ్గెట్స్ ఏర్పడటాన్ని ప్రేరేపించగలవని గుర్తించింది. ఈ ప్రక్రియలో యాంత్రిక ఒత్తిడి కారణంగా కొన్ని పదార్థాలలో విద్యుత్ చార్జ్‌ను కలిగిస్తుందని వెల్లడించింది. ఒత్తిడికి గురైన క్వార్ట్జ్ దాని ఉపరితలంపై ఎలెక్ట్రోకెమికల్‌గా బంగారాన్ని నిక్షిప్తం చేయడమే కాకుండా... అది బంగారు నానోపార్టికల్స్‌ను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియ కొత్త వాటిని ఏర్పరచడం కంటే ఇప్పటికే ఉన్న వాటిపై బంగారం పేరుకుపోవడానికి దారితీస్తుంది. కాలక్రమేణా మరింత బంగారంతో ప్లేటింగ్ చేస్తుంది. దీని ద్వారా అధిక బంగారం నిక్షిప్తం అవుతుంది. ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అయిన క్వార్ట్జ్.. కండక్టర్ అయిన బంగారం.. ఈ ప్రాసెస్ కు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. క్వార్ట్జ్ భూకంపం సమయంలో ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు.. విద్యుత్ చార్జ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బంగారు కణాలను ఆకర్షిస్తూ.. ఇప్పటికే ఉన్న స్టోరేజ్ పై మరింత యాడ్ చేస్తుంది. కాలక్రమేణా.. పెద్ద బంగారు నగ్గెట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ తాజా అధ్యయనం భవిష్యత్తులో బంగారం అన్వేషణ, మైనింగ్‌కు సంబంధించిన అంశాల్లో కీలకంగా మారనుంది.


‘లిక్కర్‌‌‌‌ బాటిళ్లే కారణం’.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసిన పోలీసులు

‘లిక్కర్‌‌‌‌ బాటిళ్లే కారణం’.. మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసిన పోలీసులు వికారాబాద్, వెలుగు: వికారాబాద్‌‌‌‌జిల్లా పెద్దేముల్‌‌‌‌ మండలం గోపాల్‌‌‌‌పూర్‌‌‌‌ గ్రామ శివారులో వారం కింద జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. చోరీ చేసిన లిక్కర్‌‌‌‌ బాటిళ్ల పంపకంలో తేడాలు రావడం వల్లే హత్య జరిగినట్లు నిర్ధారించి, ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేశారు. కేస...


Leopard: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలకు అధికారుల హెచ్చరిక, ఈ నెంబరుకు కాల్ చేయండి!

Leopard In Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. రాజమండ్రి శివారు లాలాచెరువు సమీపంలోని దూరదర్శన్‌, ఆలిండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పంది వెనుక మాటు వేసి వెళ్తూ దానిపై దాడికి పాల్పడిన దృశ్యాలను బమ్మూరు పోలీసులకు దూరదర్శన్‌ సిబ్బంది అందజేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అటవీ అధికారులు చిరుత కదలికలు...


CV Anand: రేవంత్ సంచలనం.. హైదరబాద్ సీపీగా మారోసారి సీవీ ఆనంద్..

cv anand : సీఎం రేవంత్ సర్కారు మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కు బాధ్యతలు అప్పగించింది.


రాజమహేంద్రవరంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రికార్డ్, వణికిపోతున్న స్థానికులు

Rajahmundry Leopard Spotted: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలో చిరుత సంచారం కలకంరేపింది. దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌లో చిరుత సంచారం రికార్డైంది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే చిరుత కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోగాలింపు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం గురించి తెలిసి స్థానికంగా కలకలంరేపింది.