సైనికుల సేవలు మర్చిపోలేనివి

సంగారెడ్డి కలెక్టరేట్‌, జూలై 26: సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

25 ఏండ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధం గురించి గుర్తు చేశారు. దేశానికి రక్షణగా ఉన్న సైనికుల గొప్పతనాన్ని కొనియాడారు. కార్గిల్‌లో సైనికుల సేవలు మర్చిపోలేనివని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి వటపత్ర సాయి, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు మెంబర్‌ అనంత కిషన్‌, కూణ వేణు, లింగగౌడ్‌, అంజయ్య, మాజీ సైనికులు పాల్గొన్నారు.

తారా ప్రభుత్వ కళాశాలలో..

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాలలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ రత్నప్రసాద్‌ జ్యోతి వెలిగించి విజయ్‌ దివస్‌ వేడుకలను ప్రారంభించారు. ఎన్‌సీసీ క్యాడెట్లకు బ్యాచ్‌ పెట్టా రు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాళ్లు ప్రవీణ, డాక్టర్‌ వెంకటేశం, ఎన్‌సీసీ అధికారి మనోజ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారు లు జగదీశ్వర్‌, అభిజిత్‌, పద్మజ, సిద్దు లు, అధ్యాపకులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.

2024-07-26T21:34:28Z dg43tfdfdgfd