52 లక్షల వేతనంతో కొలువు

  • ‘ఎన్వీడియా’లో కరీంనగర్‌ వాసి ఆశ్రితకు భారీ ప్యాకేజీ

తిమ్మాపూర్‌ రూరల్‌, జూలై 26: కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె క్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత రూ.52 లక్షల వార్షిక వేతనంతో బెంగళూరులోని ఎన్వీడియా కంపెనీలో ఏఎస్‌ఐసీ ఇంజినీర్‌గా ఎంపికైంది. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఆశ్రిత ఓ రైతు కుటుంబంలో జన్మించింది. 2022లో జ్యోతిష్మతిలో బీటెక్‌ పూర్తి చేసిందని కాలేజీ చైర్మ న్‌ సాగర్‌రావు తెలిపారు. గతంలో ఇస్రో లో ఇంజినీర్‌గా ఎంపికైనప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదులుకున్నదని పేర్కొన్నారు. అలా గే రాజేశ్‌కుమార్‌ కాల్‌క్వామ్‌ ఇండియా కంపెనీలో 16.85 లక్షల ప్యాకేజీతో అసోసియేట్‌ ఇంజినీర్‌ ఉద్యోగం సాధించాడు. వీరిని కళాశాల చైర్మన్‌, సెక్రటరీ కరస్పాండెంట్‌ సుమిత్‌సాయి, ప్రిన్సిపాల్‌ కేఎస్‌ రావు, డీఎన్‌ వైశాలి అభినందించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్‌ రహదారిపై గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 7 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి విద్యార్థులను ఈడ్చుకెళ్లారు.

– చేవెళ్లటౌన్‌

2024-07-26T23:15:56Z dg43tfdfdgfd