SAULOS CHILIMA | కొండల్లో కూలిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌.. మలావి ఉపాధ్యక్షుడు దుర్మరణం

Saulos Chilima : సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ చిలిమా (Saulos Chilima) జాడ దొరికింది. ఆయన ప్రయాణించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో 9 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చికంగావా పర్వత శ్రేణిలో చిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిందని మలావి మీడియా సంస్థలు తెలిపాయి.

సాలోస్‌ చిలిమా మరణం నేపథ్యంలో మలావి అధ్యక్షుడు లాజారస్‌ చక్వెరా ఈరోజును సంతాపదినంగా ప్రకటించారు. ఈ మేరకు మలావి అధ్యక్ష కార్యాలయం, క్యాబినెట్ కార్యాలయం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ‘సోమవారం ఉదయం రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిన ఘటనలో దేశ ఉపాధ్యక్షుడు చిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలుకావడం బాధాకరం’ అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నాయి.

2024-06-11T12:14:50Z dg43tfdfdgfd