కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : వేముల వీరేశం

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కేవీఎస్ నుంచి సుమారు 30 మంది నాయకులు ఐఎన్ టీయూసీలో చేరారు. సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సమప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T04:20:20Z dg43tfdfdgfd