గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు

గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిషేధిత గుడుంబా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు. నెక్కొండ మండలం మైబునాయక్ తండాకు చెందిన బానోతులక్ష్మి, బాదావత్ పున్నమ్మ, భూక్య వీరమ్మ, బాదావత్ విజయ, బానోతు తారమ్మ, బానోతు రూప్లి 36 లీటర్ల నాటుసారను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పర్వతగిరి చౌరస్తాలో పట్టుకుని, కేసు నమోదు చేశారు. 

నాటు సారా విలువ సుమారు రూ.14,400 ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై వెంకన్న, సిబ్బంది రాజు, లింగమూర్తి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మండల పరిధిలోని దౌలత్ నగర్ శివారు మంగల్ బోడ్ తండాలో ఈనెల 8న రాత్రి తండాకు చెందిన రైతులు మాలోతు సంతోశ్, మాలతో వీరన్న  ఆరబెట్టిన ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T05:05:28Z dg43tfdfdgfd