ఫారెస్ట్ పర్మిషన్ వచ్చేలా కృషి చేద్దాం : నీరజ్ కుమార్

ఫారెస్ట్ పర్మిషన్ వచ్చేలా కృషి చేద్దాం : నీరజ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లు,సెల్ టవర్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేద్దామని డీఎస్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 24 రహదారులతో పాటు టవర్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనుమతులు ఇవ్వడానికి అటవీశాఖ సిద్ధంగా ఉందని

దరఖాస్తులు సరైన విధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉంటుందన్నారు. టెండర్ ప్రారంభ ప్రక్రియలోనే అటవీశాఖ అనుమతి తీసుకొని పని ప్రారంభిస్తే ఇబ్బందులు కావన్నారు. వివిధ శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలు పెండింగ్ లేకుండా చూస్తానని, ఎప్పటికప్పుడు అనుమతులు వచ్చే విధంగా రాష్ట్ర కార్యాలయంతో సంప్రదిస్తానని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T05:05:28Z dg43tfdfdgfd