రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్ ఫలితాలు రేపు అనగా జూన్ 12వ తేదీన విడుదల కానున్నాయి.  మే 20 నుంచి జూన్‌ 2 వరకు టెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు.  పేపర్‌ వారీగా చూస్తే.. పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు.  ఇక పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు.  తొలిసారి రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.  జూన్ 03న  ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాలు  స్వీకరించిన  అనంతరం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్దం అయ్యారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-06-11T15:22:07Z dg43tfdfdgfd