Trending:


చేప చెరువులోకొచ్చేనా..?

చేపా చేపా ఎప్పుడొస్తావ్‌ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్‌ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.


20 మంది ఐఏఎస్​ల బదిలీలు

20 మంది ఐఏఎస్​ల బదిలీలు వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లే 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్ త్వరలో మరిన్ని ట్రాన్స్​ఫర్లు ఉండే చాన్స్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశా...


SIFKA | అంబానీ ఇంట పెండ్లికి.. సబ్బినాడు జ్ఞాపిక

అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంనగర్‌ నుంచి తరలి వెళ్లినవే.


వనపర్తి జిల్లాలో పురాతన రాతి శిల్పాలు లభ్యం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహానికి కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం కనిపిస్తున్నాయి.


మంచి పథకం.. పేదలకు రూ.12,000. ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి

Sauchalay Yojana:స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఇంట్లో మరుగుదొడ్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తోంది. మరుగుదొడ్ల పథకానికి మున్సిపాలిటీ పరిధిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామాల్లో గ్రామపెద్ద, గ్రామాభివృద్ధి అధికారి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. టాయిలెట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ 2024:ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల పథకాన్ని ప్రారంభించారు. బహిరంగ మలవిసర్జన మురికిని వ్యాప్తి చేయడమే కాకుండా, అనేక వ్యాధులకు కారణమవుతుందని మనకు తెలుసు. అందువల్ల దేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు, వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేని, మరుగుదొడ్ల నిర్మాణానికి వారి పరిస్థితి అనుకూలంగా లేని వారికి ప్రధానమంత్రి హెల్తీ ఇండియా క్యాంపెయిన్ కింద భారత ప్రభుత్వం రూ.12,000 గ్రాంటును ఇస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే గ్రాంటు మొత్తాన్ని 2 విడతల్లో లబ్ధిదారుడికి ఇస్తారు, ప్రతి విడతలో రూ.6000 చొప్పున లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు పంపుతారు. ఇళ్లలో మరుగుదొడ్లు లేని వారు.. మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రాంటు పొందడానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలు:భారతీయ పౌరులు అయివుండాలి. ఈ పథకం లబ్ధి పొందే లబ్ధిదారు కుటుంబంలో ఇప్పటికే ఇంట్లో మరుగుదొడ్డి ఉండకూడదు. దారిద్య్రరేఖకు దిగువన (BPL) నివసిస్తున్న కుటుంబాలన్నీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడి దగ్గర అవసరమైన ఉండాలి. (image credit - x - @bikasku25791540) ఈ పథకం పొందేందుకు ఉండాల్సిన పత్రాలు:ఆధార్ కార్డు, బీపీఎల్ రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నెంబరు, ఇమెయిల్ ఐడి. (image credit - x - @bikasku25791540) ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ముందుగా స్వచ్ఛభారత్ మిషన్ అధికారిక వెబ్‌సైట్‌ (https://swachhbharatmission.gov.in)కి వెళ్లాలి. ఆ తర్వాత వెబ్‌సైట్ హోమ్ పేజీలో సిటిజన్ కార్నర్‌లో IHHL అప్లికేషన్ ఫామ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సిటిజన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత, రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఐడీ పాస్ వర్డ్ వస్తుంది. ఐడి మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ మీ మొబైల్ నంబర్ వెనుక 4 అంకెలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ముందు డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. న్యూ అప్లికేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే టాయిలెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫారంలో కోరిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. మొత్తం సమాచారం ఎంటర్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, సబ్‌మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ పథకం కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ముందుగా మీ గ్రామ పంచాయతీ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాలి. ఈ పథకానికి దరఖాస్తు చేయమని గ్రామపెద్దను అడగాలి. మీ మరుగుదొడ్డి పథకం ఫారం గ్రామ పెద్ద నింపుతారు.ఆ తర్వాత టాయిలెట్ హెడ్ ద్వారా ఫారంని ఆన్‌లైన్‌కి పంపుతారు. ఆ తరువాత, మీరు మరుగుదొడ్డిని నిర్మించుకోవడానికి మనీ ఇస్తారు. (image credit - x - @prauk7)


నిజాం కాలంలో నిర్మాణాలు

నిజాం కాలంలో నిర్మాణాలు ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలంలో హైదరాబాద్​ నగరంలో ఎన్నో నిర్మాణాలను చేపట్టారు. వీటిలోని చాలా భవనాలు నేటికీ ఆఫీస్​ కార్యాలయాలుగా, హాస్పిటల్స్​​గా సేవలు అందిస్తున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్​ చేపట్టిన నిర్మాణాల్లో దివాన్ దేవిడి, కింగ్​ కోఠి, ఉస్మానియా హాస్పిటల్,​ మొజంజాహీ మార్కెట్​, ఈఎన్​టీ హాస్పిటల్​, రాష్ట్ర హైకో...


అన్నదాతల ఆందోళన

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.


బీజేపీ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో వందలాది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.


ప్రైవేట్‌కు దీటుగా విద్యనందించాలి

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిలాల్లో వర్షాలకు ఛాన్స్

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. నేడు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. జూన్ 17 తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది.


NEET: 'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు

NEET UG 2204 Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంలో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. బిహార్ కేంద్రంగా పేపర్ లీకేజీ జరిగినట్లు సిట్ విచారణలో తేలినట్లు జాతీయమీడియాలో కథనాలు వస్తున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులు రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) వాటిని తోసిపుచ్చింది. అయితే, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ (Bihar) ప్రభుత్వం సిట్‌ను...


మేం చెప్పినా కేసీఆర్ ​పట్టించుకోలే : రిటైర్డ్​ ఇంజినీర్లు

మేం చెప్పినా కేసీఆర్ ​పట్టించుకోలే : రిటైర్డ్​ ఇంజినీర్లు మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే మా రిపోర్టును పక్కనపెట్టి ఆయనకు నచ్చినట్లు చేసిండు జస్టిస్​ ఘోష్​ కమిషన్​ ముందు రిటైర్డ్​ ఇంజనీర్ల వెల్లడి     తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడ్తేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు     మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలన...


జపాన్ లో మాంసం తినే బ్యాక్టీరియా!

జపాన్ లో మాంసం తినే బ్యాక్టీరియా! వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర స్ట్రెప్టోకోకల్ వ్యాధి     48 గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీసేస్తది     ఈ ఏడాది ఇప్పటికే 977 కేసులు నమోదు టోక్యో : జపాన్ లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాల...


హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్

హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్ మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ వీడియో     సోషల్ మీడియాలో వైరల్ బారి(ఇటలీ) : ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిన్న సెల్ఫీ వీడియో దిగారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటలీలో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా మోదీతో మెలోనీ ఐదు సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను శనివార...


Ap volunteers: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన వాలంటీర్లు... వారిపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదులు.. ఎందుకంటే?

Andhra pradesh: ఏపీ సచివాలయం, వాలంటీర్ ఉద్యోగులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.


Civils Prelims | కొనసాగుతున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌.. మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్ష

ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2024 ప్రిలిమ్స్‌ (Civils Prelims) పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహిస్తారు.


Eid al-Adha 2024 : స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 2 రోజులు సెలవులు!

Holiday to Schools : విద్యాసంస్థలకు వరుసగా రెండు రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో హాలిడేస్‌ వస్తున్నాయ్‌. ఇప్పటికే ప్రభుత్వం బక్రీద్‌ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.


ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే

ఏ టైంలోనైనా ఎన్డీఏ సర్కారు పడిపోవచ్చు : ఖర్గే మోదీకి మెజార్టీ లేదు న్యూఢిల్లీ : ఎన్​డీఏ సర్కారు పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీకి మెజార్టీ లేదని తెలిపారు. బీజేపీ పొత్తులను కాపాడుకునేందుకు పోరాడు తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ కామెంట్స్​ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏద...


Flesh Eating Bacteria: కండరాల్ని కొంచెం కొంచెంగా కొరికి, 48 గంటల్లో ప్రాణాలు తీసే భయంకరమైన బ్యాక్టీరియా

Flesh Eating Bacteria Spreads: కండరాన్ని కొంచెం కొంచెంగా కొరికి తినే బ్యాక్టీరియా జపాన్‌ని గడగడ వణికిస్తోంది. సోకిన 48 గంటల్లో మొత్తంగా శరీరాన్ని తొలిచేసి ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త కొవిడ్‌ భయం నుంచి కోలుకుంటుండగా ఇప్పుడు కొత్తగా flesh-eating bacteria కలవర పెడుతోంది. Bloomberg వెల్లడించిన వివరాల ప్రకారం ఈ జబ్బు పేరు Streptococcal toxic shock syndrome.ఈ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైందంటే సోకిన రెండు రోజుల్లోనే మొత్తం శరీరాన్ని పీల్చి...


కొల్లాపూర్​లో కరెంట్ సమస్య రానీయొద్దు : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​లో కరెంట్ సమస్య రానీయొద్దు : జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్​లో విద్యుత్ సమస్య రానీయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్యాకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన రివ్యూ మీటింగ్​కు  ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఆయన హాజరయ్యారు. సభలో కౌన్సిలర్లు మాట్లాడుతూ..  వీధిలైట్లు లేక ప్రజలు చాలా ...


Sahitya Akademi 2024 Yuva Puraskar: తెలంగాణ వాసికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం, రమేష్ కార్తీక్ నాయక్‌కు కేటీఆర్ కంగ్రాట్స్

న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి కె వైశాలి, హిందీ రచయిత గౌరవ్ పాండే సహా ప్రతిష్టాత్మకమైన యువ పురస్కారాన్ని అందుకోనున్న 23 మంది రచయితల పేర్లను సాహిత్య అకాడమీ శనివారం (జూన్ 15న) ప్రకటించింది. సంస్కృతంలో యువ పురస్కార విజేతను త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 2024 ఏడాదికిగానూ 24 మంది బాల సాహిత్య పురస్కార విజేతల జాబితాను ప్రకటించింది. 2024 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన వారిలో...


చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్

చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో గురువారం జరిగిన హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊట్కూర్ ఠాణాలో కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం వెల్లడించారు.  దాడికి పాల్పడిన మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్​ తరలించామన్నారు....


మిస్టరీ : కృష్ణుడి ఏకాంత మందిరం నిధివన్‌

మిస్టరీ : కృష్ణుడి ఏకాంత మందిరం నిధివన్‌ కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదని అంటుంటారు కొందరు. ‘‘కన్నయ్య ఇప్పటికీ ప్రతిరోజూ భూమ్మీదకు వస్తాడు. బృందావనంలోని ఒక ఆలయానికి వచ్చి, గోపికలతో కలిసి నృత్యం చేస్తాడు. అందుకే అర్ధరాత్రుళ్లు ఆలయం దగ్గర్లో ఆయన చేసే వేణుగానం, గోపికల కాళ్ల గజ్జెల చప్పుళ్లు వినిపిస్తుంటాయ’’ని చాలామంది చెప్తుంటా...


Weather Latest Update: తెలంగాణకు భారీ వర్షాలు, ఈ జిల్లాల వారికి అలర్ట్ - ఐఎండీ

Weather Latest News: నిన్న రాయలసీమ నుండి పశ్చిమ - మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1కి. మీ, 5.8 కి.మీ. మధ్యలో కొనసాగిన ద్రోణి ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని...


మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు

రాష్ట్రంలో స్వ యం సహాయక సంఘాలకు ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలను అందించనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.


నేడు ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో ఆదివారం కింగ్‌ కోఠిలోని ఈడెన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆర్టిఫిషియల్‌ లింబ్‌, కాలిఫర్స్‌, ఫిట్‌మెంట్‌తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ్‌ సేవా సంస్థాన్‌ ట్రస్టీ డైరెక్టర్‌ దేవేంద్ర చౌబిసా, కో ఆర్డినేటర్‌ అల్కా చౌదరి తెలిపారు.


వికారాబాద్ లో పోలీసుల దాష్టీకం..ఫిర్యాదు దారునే చితకబాదిన వైనం

వికారాబాద్ లో పోలీసుల దాష్టీకం..ఫిర్యాదు దారునే చితకబాదిన వైనం వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారుడినే పోలీసులు చితకబాదారు. సంతోష్ అనే యువకుడిని ఎస్సై ఆనంద్ కుమార్, కానిస్టేబుళ్లు విచక్షణా రహితంగా కొట్టారు. దోమ మండలం దిర్సంపల్లి తాం...


Good news : జూన్ 18న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

Good news : జూన్ 18న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు రూ.20 వేల కోట్లు జమచేయనున్న మోదీ: కేంద్ర మంత్రి శివరాజ్ న్యూఢిల్లీ, వెలుగు: పీఎం కిసాన్ యోజన 17వ విడత నిధులను మంగళవారం రైతుల ఖాతాల్లో జమచేయనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీంతో 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరందని వివరించారు. ఈనెల 18న ప్రధాని నరేంద్ర మోద...


ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు

ఒంటరి మహిళలే టార్గెట్.. ఒకే రోజు నాలుగు గొలుసు చోరీలు మేడ్చల్ జిల్లా శామీర్ పేట PS పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేరువేరు చోట్ల వరుసగా దొంగతనానికి పాల్పడ్డారు. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులలా పుస్తెలతాడు లాక్కొని బైక్ పై పారిపోయారు. అదే మండలం కేశవరం గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న మహిళ మ...


విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్‌ మండలం బూరుగూడ మెయిన్‌ రోడ్డులోని కళావతి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీతో కలిసి తనిఖీ చేశారు.


భారత ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం పొందే వ్యక్తి ఎవరు? ప్రధానమంత్రికైనా వాళ్ల తర్వాతనే!

మనదేశంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే విషయంలో ప్రధానమంత్రి ఐదో స్థానంలో ఉన్నారు. అయితే అసలు భారత ప్రభుత్వం ఏ వ్యక్తికి అత్యధిక జీతం ఇస్తుందో తెలుసా? వారు ఏ పదవిలో ఉన్నారు, ఎంత జీతం తీసుకుంటారు? భారత ప్రభుత్వం ద్వారా అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి రాష్ట్రపతి. రాష్ట్రపతికి ప్రతి నెల రూ. 5 లక్షల జీతం వస్తుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్సులు, అధికారిక నివాసంగా రాష్ట్రపతి భవన్, ప్రభుత్వ వాహనాలు, 24 గంటల భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారు. జీతం పరంగా ఉపరాష్ట్రపతి రెండవ స్థానంలో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కు నెలకు రూ. 4 లక్షల జీతం వస్తుంది. ఇది కాకుండా అనేక రకాల అలవెన్సులు, ప్రభుత్వ బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, 24 గంటల భద్రతా సిబ్బంది, వైద్య సదుపాయాలు తదితరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గవర్నర్ మూడో స్థానంలో ఉంటారు. భారత ప్రభుత్వం గవర్నర్‌కు రూ. 3.50 లక్షల జీతం ఇస్తుంది. ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్‌కు విలాసవంతమైన బంగ్లా, భద్రతా సిబ్బంది, సేవకులు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. నాలుగో స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. సీజేఐకి నెలకు రూ.2.80 లక్షల జీతం లభిస్తుంది. ఇవే కాకుండా రాజధాని ఢిల్లీలో అద్దె బంగ్లా, 24 గంటల భద్రతా సిబ్బంది, కారు వంటి సౌకర్యాలు కల్పించారు. జీతం విషయంలో దేశ ప్రధాని ఐదో స్థానంలో ఉంటారు. ప్రతి నెలా ప్రధాని రూ.1.66 లక్షల వేతనం పొందుతున్నారు. ఇందులో వివిధ రకాల అలవెన్సులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ వసతితో పాటు వారికి ఎస్పీజీ భద్రత, ప్రత్యేక నౌకలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.


TTD Admissions : 10th పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. రేపే చివరితేది

Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టెన్త్‌ పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. శిల్పకళలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.


త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు

త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పని చేస్తున్న 144 మందిని తీసుకొచ్చే ప్రాసెస్ స్పీడప్      రిలీవ్ చేయాలని ఏపీ సర్కార్​కు సీఎస్ శాంతికుమారి లేఖ       ఉద్యోగులతో సమావేశమైన టీఎన్జీవో నేతలు హైదరాబాద్, వెలుగు :  ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వాళ్లను తాము తీసుకుంటామని, ఎన్ వోసీ...


సంతోష్​బాబు త్యాగం మరువలేనిది

సంతోష్​బాబు త్యాగం మరువలేనిది సూర్యాపేట, వెలుగు : దేశం కోసం కల్నల్​సంతోష్​బాబు చేసిన త్యాగం మరువలేనిదని 31వ తెలంగాణ బెటాలియన్ అధికారి కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంతోష్​​బాబు విగ్రహానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశం కోసం వీరమరణం పొందిన సంతోష్​​బాబు పేరు చరిత్రలో నిలిచిపోతుంద...


కొత్తగా పోడు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు.


సొంత లాభం కొంత మానుకొని…

‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి పాటుపడవోయ్‌' అన్నది గురజాడ మాట. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన నకుల్‌ దత్తా ఈ మాటలకు ఉదాహరణలా కనిపిస్తాడు.


త్వరలో దవాఖానల్లో ఖాళీల భర్తీ

రాష్ట్ర ప్రభుత్వం వివిధ దవాఖానలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.


వర్షాకాలంలో ఇబ్బందుల్లేకుండా చూడండి

వర్షాకాలంలో ఇబ్బందుల్లేకుండా చూడండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్, వెలుగు : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెంటనే స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డును యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. ఔటర్ లోప...


India Vs Canada: భారత్‌తో కలిసి నడుస్తాం, ప్రధాని మోదీతో భేటీపై ట్రూడో కీలక వ్యాఖ్యలు

India Canada Tensions: G7 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో వీళ్లిద్దరూ సమావేశమవడం కీలకంగా మారింది. పైగా ఈ భేటీపై ట్రూడ్ చేసిన వ్యాఖ్యలూ ఆసక్తి కలిగిస్తున్నాయి. గొడవలన్నీ పక్కన పెట్టి ఇకపై కలిసి ముందడుగేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగానే చెప్పారు. భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు. "కొన్ని కీలక అంశాలపై కలిసి పని...


Farmer Schemes: రైతులకు స్పెషల్ స్కీమ్.. 50 శాతం తగ్గింపు!

అన్నదాతలకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. వ్యవసాయం చేసే వారికి లేదంటే సాగు చేయాలని భావించే వారికి అదిరే బెనిఫిట్ ఉంది. ప్రభుత్వం ఏకంగా 50 శాతం రాయితీ అందిస్తోంది. వ్యవసాయ పరికరాలు లేదా వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు 50 శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది....


ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు

ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డయాలసిస్  సెంటర్ లో కొంత భాగం దగ్ధమైంది. పేషెంట్లు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుక...


విద్యుత్​ అక్రమాలపై తొండి లేఖ.. భుజాలు తడుముకుంటున్న కేసీఆర్

విద్యుత్​ అక్రమాలపై తొండి లేఖ.. భుజాలు తడుముకుంటున్న కేసీఆర్ ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో నాకు మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి హాజరుకాను’ అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇరవై రెండు పేజీల లేఖ రాశారు.  తన పదేండ్ల హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలెవరినీ తెలంగాణ ఆవిర్బావ ...


వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌ ఓఎంఆర్‌ స్కాన్డ్‌ కాపీలు

రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్‌ చేసిన, డిజిటలైజ్‌డ్‌ ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లను వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ శనివారం ప్రకటించారు.


భవనం కట్టారు.. వసతులు మరిచారు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో సుమారు 300 కుటుంబాలకు పైగా ఉన్నాయి.


తమ్ముడిని హత్య చేశాడని వెంటాడి చంపారు

తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌,


ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు

ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ     ఎక్కడ? ఎలా? ఎంత మేర? పెంచాలనే దానిపై మార్గదర్శకాలు      బహిరంగ రేటుకు తగ్గట్టుగా ప్రభుత్వ మార్కెట్ విలువ పెంపు.. గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర..పట్టణాల్లోనూ      ఏరియాను బట్టి భూముల విలువ సవరణలు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూముల విలువలు పెరుగనున్నాయి....


భారతీయులు పనికోసం గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు

గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల తర్వాత కార్మికుల స్థితిగతులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇంతకీ భారతీయులు పని కోసం గల్ఫ్ దేశాలకే ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఈ వలసల చరిత్ర ఏంటి?


Telangana | ప్రభుత్వం పట్టించుకోదు.. పోలీసులు పనిచేయరు.. ప్రశాంత తెలంగాణలో అశాంతి జ్వాల

రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ చురుకైన కార్యకర్త మల్లేశ్‌యాదవ్‌ను భూతగాదాల ముసుగులో ప్రత్యర్థులు హతమార్చారు.


సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా

సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా జోహన్నెస్​బర్గ్: సౌతాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా(71) రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆఫ్రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు రామఫోసాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో రామఫోసా....


ఈ ఆలయంలో స్వామి వారిని దర్శిస్తే కలిగే భాగ్యం మీకు తెలుసా..

వేణుగోపాలస్వామి ఆలయమును పనిడవ 5వ శతాబ్దం శాలివాహన కాలంలో నిర్మించినట్లు చరిత్ర శాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ కృష్ణ భగవానుడు కాళీ మర్దన వేణుగోపాల స్వామి గా మనకి దర్శనం ఇస్తారు అనగా కాళీ అనే రాక్షషి పాముని కృష్టనుడు వదిస్తాడు ఆ ఘట్టానికి చెందిన విగ్రహం ఇక్కడ సాలివాహన రాజులు భీష్మేకదశి ప్రతిష్టించి ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించేవారు. ఈ ఉత్సవాన్ని శాలి హుండయాత్రగా ప్రసిద్ధి చెందిన గుడి విషయాలు తెలుసుకుందాం పదండి..కొండపైన పురాతన వేణుగోపాలస్వామి...